Liver Healthy Foods | ఈ 5 రకాల ఆహారాలు తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది!-5 foods you must consume to boost liver health ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Foods You Must Consume To Boost Liver Health

Liver Healthy Foods | ఈ 5 రకాల ఆహారాలు తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది!

Oct 12, 2022, 08:09 PM IST HT Telugu Desk
Oct 12, 2022, 08:09 PM , IST

  • శరీరంలో కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. శరీరంలోని మలినాలను తొలగించడం, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడం వంటి ముఖ్య విధుల్లో పాత్ర వహిస్తుంది. కాబట్టి అలాంటి కాలేయానికి సరైన పోషణ అందిస్తూ దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. 

కాలేయం శరీర వివిధ అవసరాలకు శక్తి కేంద్రం. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా 5 రకాల ఆహార పదార్థాలను సూచించారు. అవేంటో మీరూ తెలుసుకోండి.

(1 / 7)

కాలేయం శరీర వివిధ అవసరాలకు శక్తి కేంద్రం. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా 5 రకాల ఆహార పదార్థాలను సూచించారు. అవేంటో మీరూ తెలుసుకోండి.(File photo)

గోధుమ గడ్డి: ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. గోధుమ గడ్డిని తినడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

(2 / 7)

గోధుమ గడ్డి: ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. గోధుమ గడ్డిని తినడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.(Unsplash)

బీట్‌రూట్ జ్యూస్: ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్‌లు, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి కాలేయంలో ఆక్సీకరణ నష్టం, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచుతాయి.

(3 / 7)

బీట్‌రూట్ జ్యూస్: ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్‌లు, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి కాలేయంలో ఆక్సీకరణ నష్టం, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచుతాయి.(ROMAN ODINTSOV)

ద్రాక్ష: ఎరుపు, ఊదారంగు ద్రాక్ష రకాల్లో రెస్వెరాట్రాల్ వంటి అనేక ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇది యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతాయి, వాపును తగ్గిస్తాయి.

(4 / 7)

ద్రాక్ష: ఎరుపు, ఊదారంగు ద్రాక్ష రకాల్లో రెస్వెరాట్రాల్ వంటి అనేక ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇది యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతాయి, వాపును తగ్గిస్తాయి.(Unsplash)

క్రూసిఫరస్ కూరగాయలు: బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు తినడం ద్వారా శరీరంలో సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచడంలో సహాయపడతాయి. ఇవి కాలేయం పనిభారాన్ని తగ్గిస్తాయి, కాలేయ ఎంజైమ్‌ల రక్త స్థాయిలను మెరుగుపరుస్తాయి.

(5 / 7)

క్రూసిఫరస్ కూరగాయలు: బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు తినడం ద్వారా శరీరంలో సహజ నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచడంలో సహాయపడతాయి. ఇవి కాలేయం పనిభారాన్ని తగ్గిస్తాయి, కాలేయ ఎంజైమ్‌ల రక్త స్థాయిలను మెరుగుపరుస్తాయి.(Pixabay)

వాల్‌నట్‌లు: ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో వాల్‌నట్‌లు అత్యంత ప్రయోజనకరమైనవి. వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, అలాగే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

(6 / 7)

వాల్‌నట్‌లు: ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో వాల్‌నట్‌లు అత్యంత ప్రయోజనకరమైనవి. వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, అలాగే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.(Unsplash)

సంబంధిత కథనం

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటలీలోని రోమ్ లో పవిత్ర గురువారపు ఆచారాన్ని నిర్వర్తించారు. ఈ సందర్భంగా రెబిబియా జైలులోని మహిళా విభాగంలోని ఒక ఖైదీ పాదాలను శుభ్రపరిచి ముద్దు పెట్టుకున్నారు.బాలీవుడ్ నటి అలయ ఎఫ్ తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, ఇందులో ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. ఈ చిత్రాలలో అలయ హాట్‌నెస్‌ని చూసి, అభిమానులకు చెమటలు పడుతున్నాయి.  హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటాం. ఒకటి చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు వస్తే, మరొకటి కార్తీక మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రోజున వస్తుంది. మొదటి హనుమాన్ జయంతిని ఆ రోజున అంజనీమాత గర్భం నుండి హనుమంతుడు జన్మించిన సందర్భంగా నిర్వహించుకుంటారు. దీపావళికి ఒక రోజు ముందు రెండో జయంతి నిర్వహించుకుంటాం.  హనుమంతుని అచంచల భక్తిని చూసి సీతాదేశి అతడిని చిరంజీవిగా ఉండమని దీవించిన రోజు.  నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు. విలాసం, ప్రేమ, శ్రేయస్సు మొదలైన వాటికి కారణం. శుక్రుడు అసురులకు అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.బృహస్పతి దేవతలకు రాజగురువు. బృహస్పతి సంచరించే రాశులకు అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంతాన ప్రాప్తికి, వివాహ బలం, సంపద, శ్రేయస్సుకు బృహస్పతి కారణం. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు