తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme C33 Launched In India । సరసమైన ధరలోనే ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌!

Realme C33 Launched in India । సరసమైన ధరలోనే ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

06 September 2022, 14:52 IST

    • రియల్‌మి తాజాగా రూ. 10 వేల లోపు బడ్జెట్ ధరలో సరికొత్త Realme C33 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో చూడండి.
Realme C33 స్మార్ట్‌ఫోన్‌
Realme C33 స్మార్ట్‌ఫోన్‌

Realme C33 స్మార్ట్‌ఫోన్‌

టెక్నాలజీ బ్రాండ్ రియల్‌మి తమ C సిరీస్‌లో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. తాజాగా Realme C33 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది సరసమైన ధరలోనే లభించే ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌, అయినా కూడా ఇందులో 50MP ఇమేజ్ సెన్సార్‌ కలిగిన డ్యుఎల్ కెమెరా సెటప్, నాణ్యమైన బ్యాటరీ, మెరుగైన డిస్‌ప్లే మొదలైన ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఈ ఫోన్ చాలా ఆకర్షణీయమైన యూనికోవర్ డిజైన్‌తో వస్తుంది. మెరుమిట్లు గొలిపై బ్యాక్ ప్యానెల్ ఇచ్చారు. ఇలాంటి డిజైన్ ఇటీవల లాంచ్ చేసిన Realme 9i 5G హ్యాండ్‌సెట్లోనూ కనిపిస్తుంది.

ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా Realme C33 రెండు కాన్ఫిగరేషనల్లో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ 3GB RAM+ 32GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉండగా, మరొక వేరియంట్ 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఈఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Realme C33 స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర వివరాలను ఈ కింద చూడండి.

Realme C33 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 3GB/4GB RAM, 32GB/64GB స్టోరేజ్ సామర్థ్యం (మైక్రో ఎస్డీ కార్డుతో 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు)
  • ఆక్టా-కోర్ Unisoc T612 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MP డ్యుఎల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W టైప్-సి క్విక్ ఛార్జర్

3GB RAM+ 32GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కోసం ధర, రూ. 8,999/-

4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కోసం ధర, రూ. 9,999/-

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, GPS 2, USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉన్నాయి. Realme C33 విక్రయాలు సెప్టెంబర్ 12, 2022 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి సైట్, ఇతర మెయిన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా జరుగుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం