తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  భారీ ట్రిపుల్ కెమెరా సెట్‌తో Realme 9 4g స్మార్ట్‌ఫోన్‌!

భారీ ట్రిపుల్ కెమెరా సెట్‌తో Realme 9 4G స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

07 April 2022, 22:50 IST

    • రియల్‌మి కంపెనీ తమ బ్రాండ్ Realme 9 అనే పేరుతో మరొక 4G మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Realme 9 4G
Realme 9 4G

Realme 9 4G

Realme కంపెనీ తమ బ్రాండ్ నుంచి ఒకేసారి వివిధ రకాల స్మార్ట్ ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో Realme GT 2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు Realme 9 4G మోడల్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

Realme 9 4G స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే.. ఇందులో భారీ పిక్సెల్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెట్ తో పాటు శక్తివంతమైన ప్రాసెసర్, మెరుగైన ర్యామ్, మంచి స్టోరేజ్ ఇలా ఎన్నో స్పెసిఫికేషన్లు ఆకట్టుకుంటున్నాయి. 

ర్యామ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది.

Realme 9 స్టార్‌గేజ్ వైట్, మెటోర్ బ్లాక్ అలాగే సన్‌బర్స్ట్ గోల్డ్ అనే మూడు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ పరిశీలించండి

Realme 9 4G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల 1080P AMOLED డిస్‌ప్లే

6GB /8GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రా-వైడ్ షూటర్, 2MP మాక్రో లెన్స్..  ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ

6GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర. రూ.17,999/- కాగా, 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర. రూ.18,999/- గా నిర్ణయించారు.

టాపిక్

తదుపరి వ్యాసం