తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Peepal Tree Benefits : రావిచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు.. ఎలా ఉపయోగించాలి?

Peepal Tree Benefits : రావిచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు.. ఎలా ఉపయోగించాలి?

Anand Sai HT Telugu

20 February 2024, 10:00 IST

    • Peepal Tree Benefits : రావిచెట్టు ఎంతో ప్రత్యేకమైనది. పురాతన కాలం నుంచి దీని ప్రస్తావన ఉంది. రావిచెట్టుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రావి చెట్టు ప్రయోజనాలు
రావి చెట్టు ప్రయోజనాలు (Unsplash)

రావి చెట్టు ప్రయోజనాలు

రావిచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఉపయోగించి.. చాలా రోగాలను నయం చేసుకోవచ్చు. ఇది మానవులకు చాలా మేలు చేస్తుంది. రావి చెట్టు సాధారణంగా నది ఒడ్డున, రోడ్ల పక్కన నీడ కోసం కనిపిస్తుంది. మన పూర్వీకులు రావి చెట్టు కింద ఎక్కువగా కూర్చొనేవారు. ఇలా చేస్తే కూడా చాలా ప్రయోజనాలు శరీరానికి దక్కుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

రావి చెట్టు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది మానవ శ్వాసకు మంచిది. తెల్లవారుజామున ఈ చెట్ల దగ్గర నడక, జాగింగ్ చేసే వారు స్వచ్ఛమైన గాలిని ఎక్కువగా పీల్చుకుంటారు. దీంతో శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా బాగుంటుంది. రావి చెట్టు గాలిలో చాలా శక్తి ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, చర్యలను నియంత్రిస్తుందని చెబుతారు.

రావి చెట్టు ఆకులు, పండ్లు, బెరడు, వేర్లు ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. శరీరంలో వేడి, అల్సర్ల వల్ల కడుపునొప్పి రావచ్చు. దాన్ని పోగొట్టుకోవడానికి రావి ఆకు రెమ్మలను మజ్జిగలో చూర్ణం చేసి సేవించవచ్చు. అలాగే ఈ ఆకులను పాలలో కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

పీరియడ్స్ సమయంలో స్త్రీలలో వచ్చే అధిక రక్తస్రావం నయం కావాలంటే రావి ఆకులతో పాటు అంజూరపు ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే సరిపోతుంది. చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

రావిచెట్టు, మర్రిచెట్టు, అంజూరపు ఆకులను మెత్తగా నూరి సేవించడం వల్ల రక్తస్రావ మూల వ్యాధులు నయమవుతాయి. ఈ చెట్టు ఆకులు, వేర్లు, గింజలు, బెరడును సేకరించి పొడి చేసి కొద్దిగా నీళ్లలో వేసి మరిగించి స్త్రీలు రుతుక్రమంలో తాగితే గర్భకోశ నష్టం తొలగి ఆరోగ్యం చేకూరుతుంది.

రావి వృక్షం నుండి రాలిపోతున్న గోధుమ రంగు ఆకులను పొడి చేసి, కొబ్బరినూనెలో కలిపి కాలిన చోట రాస్తే గాయాలు మానడంతో పాటు మచ్చలు మాయమవుతాయి. బెరడును వేయించి పొడి చేసి కొబ్బరినూనెలో కలిపి దీర్ఘకాలిక గాయాలకు, దద్దుర్లకు, గజ్జిలకు రాస్తే నయం అవుతాయి.

ఈ రావి చెట్టు బెరడుకు జలుబు, ఉబ్బసం వంటి వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. అలాగే విపరీతమైన అలసట, ఫిట్‌నెస్ లోపించడం, శరీర కండరాలను బలోపేతం చేయడం వంటి ప్రభావాలను దూరం చేస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

రావి చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించి పుక్కిలిస్తే నోటి పుండ్లు నయమవుతాయి. బెరడును దంచి కొంచెం నీళ్లలో వేసి మరిగించి తాగితే చర్మవ్యాధులు పోతాయి. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే నిరంతర దగ్గు నయమవుతుంది. బెరడు పొడిని బూడిదగా చేసి అతి తక్కువ నీటిలో నానబెట్టి తాగితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. రోజూ కొద్ది మొత్తంలో రావి చెట్టు బెరడు పౌడర్ తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

ఈ కాలంలో చాలా మంది చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నారు. చర్మం నల్లగా, దురదగా మారతుంటుంది. ఆ పరిస్థితి ఉన్నవారు రావి చెట్టు బెరడును నీళ్లలో నానబెట్టి దురదగా ఉన్న ప్రదేశంలో రాస్తే చర్మం సాధారణ రంగులోకి మారుతుంది, దురద పోతుంది.

చిన్న కత్తితో లేదా కొడవలితో రావి వృక్షం బెరడును గీకితే ఆయా ప్రాంతాల నుంచి పాలు కారుతాయి. ఆ పాలను సేకరించి పాదాల నొప్పికి వాడుకోవచ్చు. గాయాలు తగిలిన చోట పూయడం వల్ల అవి త్వరలోనే మానిపోతాయి. ఇలా రావిచెట్టుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం