తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  విదేశీ విద్యకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇలా సొంతంగా నిధులు సమకూర్చుకోండి!

విదేశీ విద్యకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇలా సొంతంగా నిధులు సమకూర్చుకోండి!

HT Telugu Desk HT Telugu

08 July 2022, 22:13 IST

    • planning for education in foreign: విదేశాల్లో విద్య అనగానే చాలా వరకు ఆర్థిక అంశంతో కూడుకుని ఉంటుంది. విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ మాత్రమే కాకుండా. పాస్‌పోర్ట్, వీసా అవరసరమైన నగదు ఏర్పాట్లు, వివిధ సంస్థలు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు పొందడం వంటి అనేక అంశాలు ఉంటాయి.
planning for education in foreign
planning for education in foreign

planning for education in foreign

విదేశీ విద్య ఇప్పుడు సాధారణం మారిపోయింది. కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉంటే చాలు చాలా మంది వీదేశాల్లో చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారు దగ్గర కొంత మెుత్తంతో పాటు ప్రభుత్వాలు, పలు ఆర్థిక సంస్థలూ ఇచ్చే సాయం ఉన్నత విద్య కలలు సాకారం చేసుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలను అభ్యర్థులు విస్మరిస్తే మాత్రం చిక్కులు తప్పవు. విదేశాలకు చదవులనువారు చాలా విషయాల్లో ముందుగా ప్లాన్ చేసుకోవాలి. తగిన అవగాహన పెంపొందించుకోవాలి. వాటిలోని ప్రధానమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

Avoid Tea and Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న ICMR వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే

Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Aloo Dosa : ఆలూ దోసెను ఇలా రెండు రకాలు తయారు చేసుకోండి

విదేశీ చదువు అనగానే చాలా వరకు ఆర్థిక అంశంతో కూడుకుని ఉంటుంది. విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ మాత్రమే కాకుండా. పాస్‌పోర్ట్, వీసా అవరసరమైన నగదు ఏర్పాట్లు, వివిధ సంస్థలు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు పొందడం వంటి అనేక అంశాలు ఉంటాయి.సాధరణంగా చదువు కోసం వెళ్లే దేశం కరెన్సీతో పోలిస్తే విద్యార్థి సొంత దేశ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని కోసం వసతి, భోజనం వంటి ప్రాథమిక ఎంత ఖర్చవుతుందనేది అంచనా వేసుకోవాలి, వాటితో విమాన టికెట్, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, లైబ్రరీ, దుస్తులు, వాహనాలు, ఇతర ఖర్చులు లాంటివీ ఉంటాయి.

విదేశీ యూనివర్సిటీలో అడుగు పెట్టగానే అస్థిరమైన పరీక్షలు, పుస్తకాల కోసం దాదాపు 4000 డాలర్లు ఖర్చు ఉంటుంది. ఇతర ఖర్చులకు సులభంగా 1500-2000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. ఏడాదికి ఒకసారి స్వదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే దానికి అదరంగా మరో 2000 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చులకు అన్నింటిని అంచనా వేసుకుని విదేశీ విద్యా ప్లాన్ చేసుకోవాలి. భారీ ప్రీ-బడ్జెట్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని డబ్బు సమకూర్చుకోవాలి. విదేశి విద్యార్థి స్కాలర్‌షిప్‌ల కోసం ప్రయత్నించాలి.

అనుకున్న ఖర్చు కంటే ఎక్కువగానే డబ్బును సమకూర్చుకునే ప్రయత్నం చేయాలి. ట్యూషన్, వసతి, భోజనం ఖర్చులు మాత్రమే కాకుండా.. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో లెక్కించుకోవాలి. ఆర్థిక తోడ్పాటు కోసం స్కాలర్‌షిప్‌లు,స్టూడెంట్ స్టైపెండ్‌లు, పార్ట్‌టైమ్ ఉపాధి వంటి వనరులను ఉపయోగించే ప్రయత్నం చేయాలి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఖర్చులను చూసి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళె ముందు ముందస్తు ప్రణాళికలు చాలా అవసరం.

తదుపరి వ్యాసం