తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhootha Budget: తెలుగు వెబ్‌సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో నాగ చైతన్య 'దూత'

Dhootha Budget: తెలుగు వెబ్‌సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో నాగ చైతన్య 'దూత'

Hari Prasad S HT Telugu

17 June 2022, 17:01 IST

    • టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగచైతన్య తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. దూత అనే ఈ సిరీస్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నిర్మించింది.
దూత వెబ్ సిరీస్ టీమ్
దూత వెబ్ సిరీస్ టీమ్

దూత వెబ్ సిరీస్ టీమ్

తెలుగులోనూ క్రమంగా వెబ్‌ సిరీస్‌ వైపు అభిమానులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే ఆహా, జీ5, డిస్నీ హాట్‌స్టార్‌లాంటి ఓటీటీలు ఎన్నో వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించాయి. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కూడా తొలిసారి ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌ను రూపొందించింది. దీని పేరు దూత. నటుడు నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ కూడా ఇదే.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

ఇప్పటికే ఈ దూత సిరీస్‌ ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజైంది. మనం, థ్యాంక్యూలాంటి మూవీలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌ విక్రమ్‌ కే కుమార్‌ ఈ సిరీస్‌ను కూడా డైరెక్ట్‌ చేశాడు. ఈ సిరీస్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌ బడ్జెట్‌ వెల్లడైంది. ఇప్పటి వరకూ తెలుగులో రూపొందిన వెబ్‌ సిరీస్‌లు అన్నింటికంటే ఈ సిరీస్‌ బడ్జెటే ఎక్కువ కావడం విశేషం.

ఈ దూత వెబ్‌ సిరీస్‌ కోసం ప్రైమ్‌ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ సిరీస్‌లో నటించిన నాగ చైతన్య, డైరెక్షన్‌ చేసిన విక్రమ్‌లు చెరో రూ.5 కోట్లు అందుకున్నారు. ఇంత బడ్జెట్‌తో రూపొందిన ఈ సిరీస్‌పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగినట్లే ఈ సిరీస్‌ కూడా ఉండటంతో డైరెక్టర్‌ విక్రమ్‌తో మరో ప్రాజెక్ట్‌ కోసం కూడా ప్రైమ్‌ వీడియో సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ దూత వెబ్‌ సిరీస్‌ ఓ హారర్‌, థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రైమ్‌ వీడియో తాము తెలుగులో నిర్మించిన తొలి వెబ్‌ సిరీస్‌కే ఇంత భారీ బడ్జెట్‌ కేటాయించడం నిజంగా విశేషమే. మరోవైపు నాగచైతన్య, విక్రమ్‌ కాంబినేషన్‌లోనే వస్తున్న థ్యాంక్యూ మూవీ జులై 8న రిలీజ్‌ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం