తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ppf Vs Epf Vs Fd: కొత్త ఆర్థిక సంవ‌త్సరంలో వడ్డీ రేట్లు ఇవే!

PPF vs EPF vs FD: కొత్త ఆర్థిక సంవ‌త్సరంలో వడ్డీ రేట్లు ఇవే!

HT Telugu Desk HT Telugu

03 April 2022, 20:30 IST

    • కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనందున, ఉద్యోగుల భవిష్య నిధి (EPF), ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై తాజా వడ్డీ రేట్లను ఒకసారి చెక్ చేయండి.
Cash
Cash

Cash

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లు తక్కువ-రిస్క్ ఉండే పెట్టుబడులు . ఇవి సురీక్షితమైన పెట్టుబడులు కాబట్టి చాలా మంది వీటిలో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు. ఈ పాపులర్ పొదుపు పథకాలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం స్థిరమైన రాబడిని పొందడం. అయితే తాజాగా నూతన ఆర్థిక సంవ‌త్సరం (2022-23) ప్రారంభ‌మైన సందర్భంగా.. దేశ‌వ్యాప్తంగా కొన్ని కొత్త నిబంధ‌న‌లను ప్రవేళపెట్టారు. ఆస్తి ప‌న్ను, గ్యాస్ ధ‌ర‌లు,మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మ‌దుపు, EPF, PPF.FDల పెట్టుబ‌డుల‌కు కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. అవేమిటో ఓ లుక్కేద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

PPF వడ్డీ రేటు

కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగానే ఉంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య 2022-23 మొదటి త్రైమాసికంలో పిపిఎఫ్, ఎన్‌ఎస్‌సితో సహా చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు లేదు.

FY 2020-21 మొదటి త్రైమాసికం నుండి వడ్డీ రేటు సవరించలేదు.

"2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు ఏప్రిల్ 1, 2022 నుండి ప్రారంభమై జూన్ 30, 2022తో ముగుస్తుంది, ఇది నాల్గవ త్రైమాసికానికి ఇదే వర్తిస్తోంది.

EPF వడ్డీ రేటు

ఇటీవల, EPF లేదా ప్రావిడెంట్ ఫండ్ (PF) వడ్డీ రేటును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 8.5 శాతం నుండి 2021-22 ఆర్థిక సంవత్సరానికి నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించింది.

EPFO తన ఖాతదారులకు FY 2020-21లో మునుపటి సంవత్సరం మాదిరిగానే 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో EPF రేటు 8.65 శాతంగా ఉండగా.. FY 2017-18లో 8.55 శాతంగా ఉంది. FY 2016-17లో, EPF వడ్డీ రేటు 8.65 శాతంగా నిర్ణయించారు.

FD వడ్డీ రేటు

సంవత్సరం కాల వ్యవధికి చేసే FD డిపాజిట్‌లకు నూతన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.5 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

 సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు త్రైమాసికానికి  5.5-6.7 శాతం వడ్డీ రేటు చెల్లించబడుతాయి, అయితే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.8 శాతంగా  లభిస్తోంది.

పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటు ఏడాదికి 4 శాతంగా కొనసాగుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం