తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : తండ్రితో గడపడం పిల్లలకు చాలా ముఖ్యం.. కచ్చితంగా ఇవి పాటించాలి

Parenting Tips : తండ్రితో గడపడం పిల్లలకు చాలా ముఖ్యం.. కచ్చితంగా ఇవి పాటించాలి

Anand Sai HT Telugu

15 April 2024, 18:30 IST

    • Parenting Tips : తండ్రితో గడపడం అనేది పిల్లలకు కచ్చితంగా ఉండాలి. మానసికంగా పిల్లల ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
పిల్లల పెంపకంపై తండ్రి పాత్ర
పిల్లల పెంపకంపై తండ్రి పాత్ర (Unsplash)

పిల్లల పెంపకంపై తండ్రి పాత్ర

పిల్లల సమగ్ర అభివృద్ధికి తండ్రి సమయం చాలా అవసరం. మంచి తండ్రి-పిల్లల సంబంధాలు పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. ఇది వారి చిన్న వయసులో మాత్రమే కాకుండా, వారి భవిష్యత్ సంబంధాలు, కెరీర్లు, సాధారణ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. పిల్లల జీవితంలో తండ్రులు పెద్ద పాత్ర పోషిస్తారు. మానసికంగా, సామాజికంగా, అభిజ్ఞాత్మకంగా ఎదగడానికి సహాయం చేస్తారు. అందుకే తండ్రి పిల్లలకు కచ్చితంగా సమయం ఇవ్వాలి.

ట్రెండింగ్ వార్తలు

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

తండ్రి గడిపే సమయం చాలా విలువైనది. అందుకే పిల్లలకు కచ్చితంగా తండ్రి టైమ్ ఇవ్వాలి. అర్థవంతమైన సంభాషణలు, కలిసి పనులు చేయడం పిల్లల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలకు నాణ్యమైన సమయాన్ని తండ్రితో గడపడానికి గల కారణాలను కచ్చితంగా తెలుసుకోండి.

పిల్లల పాఠశాల విద్యలో తల్లిదండ్రుల ప్రమేయంతో సానుకూలంగా సంబంధం కలిగి ఉంటుంది. సహకార పఠనం, పాఠశాల పనిలో సహాయం చేయడం, సంభాషణలను ప్రేరేపించడం అభిజ్ఞా అభివృద్ధికి సహాయపడతాయి. పిల్లలు హోం వర్క్ చేసుకుంటుంటే కచ్చితంగా తండ్రి సాయం చేయాలి. వారికి చెప్పిన పాఠాల గురించి నవ్వుతూ మాట్లాడాలి. ఏదైనా అర్థంకాకుంటే అడగమని చెప్పాలి.

తండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు. వారి వైఖరులు, చర్యలు, నైతికతలను ప్రభావితం చేస్తుంది. తమ పిల్లలతో అర్థవంతమైన సమయాన్ని గడిపే తండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు, ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను రూపొందించవచ్చు. ఎలా వెళ్తే జీవితం బాగుంటుందో వివరించాలి. జీవితంలో సాధించాల్సిన విషయాల గురించి తప్పకుండా చెప్పాలి. అప్పుడే పిల్లలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.

తండ్రి-పిల్లల బంధం బలమైన భావోద్వేగ బంధాన్ని పెంపొందిస్తుంది. కలిసి ఆడటం వలన భద్రత, అంగీకార భావం కలుగుతుంది. ఇది వారి మానసిక శక్తిని బలపరుస్తుంది. అంతేకాదు మీతో చాలా విషయాలు పంచుకునేందుకు ఇలా చేయాలి. అప్పుడే వారు మీత ఏదీ దాచకుండా చెప్పేస్తారు.

పిల్లలతో తండ్రి తాను చేసే పని గురించి చెప్పాలి. ఆఫీసులో ఉండే నిర్మాణాత్మక విమర్శలు, విజయాలను పంచుకోవడం ద్వారా పిల్లల విశ్వాసం, ఆత్మగౌరవం బలపడతాయి. అంతేకాదు భవిష్యత్తులో వారు ఎలా ఉండాలో క్లారిటీ వస్తుంది.

మీరు మీ పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే.. సహకారం, కమ్యూనికేషన్, సంఘర్షణల పరిష్కారం వంటి ముఖ్యమైన సామాజిక నైపుణ్యాలను గురించి తెలుసుకుంటారు. తండ్రి, పిల్లల మధ్య ఇది బాగా ఉపయోగపడుతుంది.

తండ్రులతో నాణ్యమైన సమయాన్ని గడిపే పిల్లలకు స్వే్చ్ఛనివ్వాలి. మద్దతు అందించాలి. ప్రతీ విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పాలి. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో తండ్రి బాధ్యత చాలా ముఖ్యమైనది.

తదుపరి వ్యాసం