తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : మీ ఇంట్లోని పెద్ద పిల్లలతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మాటలు అస్సలు చెప్పకండి

Parenting Tips : మీ ఇంట్లోని పెద్ద పిల్లలతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మాటలు అస్సలు చెప్పకండి

Anand Sai HT Telugu

14 April 2024, 9:30 IST

    • Parenting Tips In Telugu : మీ ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే బిడ్డను పెంచడానికి, ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలను పెంచడానికి చాలా తేడా ఉంది. మీరు ఆ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారో అదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు.
తల్లిదండ్రులకు చిట్కాలు
తల్లిదండ్రులకు చిట్కాలు (Unsplash)

తల్లిదండ్రులకు చిట్కాలు

ఇద్దరు పిల్లలను పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్. అయితే వారు జీవితంలో ఎదగాలంటే మీరు వారిని చూసే విధానం కూడా చాలా ముఖ్యం. పెద్దవారిని చూసే విధానంలో, వారితో మాట్లాడే మాటల్లో తేడా ఉండాలి. చిన్న బిడ్డపై ఎక్కువ ప్రేమను చూపిస్తే.. పెద్దవారిపై ఎఫెక్ట్ పడుతుంది. మొదటి బిడ్డపై కూడా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది అని గుర్తుంచుకోండి. మీ పెద్ద పిల్లల ముందు కొన్ని మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి.

ట్రెండింగ్ వార్తలు

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

అలా అనకూడదు

పిల్లలు ఉన్న ఇంట్లో చాలా సార్లు కొట్లాడుకుంటారు. పెద్ద పిల్లవాడు కూడా గాయపడవచ్చు. అలాంటప్పుడు పెద్ద పిల్లవాడు వచ్చి మీతో ఫిర్యాదు చేయడం సహజం. అయితే వారు చెప్పగానే.. చిన్నొడు కదా వదిలేయ్ అని ఎక్కువగా చెప్పకూడదు. ఇద్దరినీ పిలిచి.. తప్పు ఎవరిదని మాట్లాడాలి. పెద్దవాడివేగా నీకేం జరుగుతుందని అనకూడదు. ఎందుకంటే ఇది వారి మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ప్రతిసారీ సర్దుకో అని చెప్పకూడదు

వాడు చిన్నవాడు, నువ్వు పెద్దవాడివి.. కొంచెం సర్దుకో అని సాధారణంగా తల్లిదండ్రులందరూ చెబుతుంటారు. కానీ గుర్తుంచుకోండి. మొదటి బిడ్డ కూడా పిల్లలే. ఎందుకంటే మీరు వారితో సయోధ్య కుదిర్చిన ప్రతిసారీ.. వారివైపు న్యాయం లేదనిపిస్తే.. మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ప్రతీసారి నేనే ఎందుకు సర్దుకుపోవాలనే మనస్తత్వం పెరుగుతుంది. తల్లిదండ్రులు తనను ప్రేమించడం లేదని అనిపించవచ్చు.

ఏడ్వనివ్వండి

ఏడవడానికి చిన్నా పెద్దా అనే తేడా ఉండదు. కానీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడూ పెద్దవారిని ఏడవకండి, నోరు మూసుకో అని తల్లిదండ్రులు చెబుతుంటారు. ఏ కారణం చేతనైనా ఇలా చేయడం సరికాదు. దానికి బదులు మీ పెద్ద బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో అడగండి. వారి సమస్యను పరిష్కరించండి.

ఈ మాటలు చెప్పకండి

ఇద్దరు పిల్లలు ఉంటే వారి మధ్య వయస్సు వ్యత్యాసం 2 నుండి 3 సంవత్సరాలు ఉండవచ్చు. అంటే మీ మొదటి బిడ్డకు ఐదు నుండి ఆరు సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. పెద్ద పిల్లవాడు మీతో మాట్లాడటానికి వచ్చిన ప్రతిసారీ చిన్నపిల్లవాడిలా చేయెుద్దని చెప్పకూడదు. తద్వారా చిన్న పిల్లవాడిపై పెద్దవాడికి కోపం పెరిగే అవకాశం ఉంది. ఇది పిల్లల మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

చిన్న తప్పులకు శిక్ష వద్దు

మీ పెద్ద పిల్లవాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే అతడి మీద కోపం తీర్చుకోవద్దు. ఏదీ తప్పు, ఏది సరైనదో వివరించాలి. లేదంటే పిల్లలు మనసులో వివక్షకు గురికావడం గురించి ఆలోచిస్తారు. నువ్వే ఇలా చేస్తే.. తమ్ముడు, చెల్లి కూడా నీలాగా తయారవుతారని మాటలు చెప్పకూడదు. ఇద్దరు పిల్లల మధ్య మంచి సంబంధాన్ని పెంపొదించాలి. తప్పుల గురించి వివరించాలి. లేకపోతే ప్రతికూల భావన ఎల్లప్పుడూ మీ పిల్లల మనస్సులో ఉంటుంది.

చిన్న పిల్లలు అయినా.. పెద్దవారు అయినా కొన్ని రకాల మాటలు వారితో అనకూడదు. వారి మనసులో పాతుకుపోతాయి. బూతులు అస్సలు మాట్లాడకూడదు. పెరుగుతుంటే వాటినే పలకుతూ ఉంటారు. ఇది పిల్లలకు చెడ్డడ పేరు తీసుకువస్తుంది.

 

తదుపరి వ్యాసం