తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : అంతా టెంపరరీనే.. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు..

Monday Motivation : అంతా టెంపరరీనే.. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు..

05 September 2022, 0:42 IST

    • ఈ అందమైన లోకంలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ టెంపరరీనే. అది మీ సంతోషమైనా.. బాధైనా.. ప్రేమైనా.. పెళ్లి అయినా.. స్నేహం అయినా.. బంధువైనా.. ఏ బంధమైనా.. ఏ వస్తువైనా.. ఈలోకం దొరికేది ఏదైనా అది టెంపరరీనే. కాబట్టి ఈ టెంపరరీ వాటి కోసం మీరు అనవసరంగా ఒత్తిడి తీసుకోవడం ఎందుకు చెప్పండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకు ఆనందపడుతూనే ఉంటాము. కానీ మన చేతుల్లో ఏముంది చెప్పండి. మన పుట్టుక కూడా మన చేతుల్లో లేకుండానే జరుగుతుంది. ఏమీ లేకుండానే ఈ భూమిపైకి వస్తాము. ఏమి లేకుండానే ఇక్కడనుంచి వెళ్లిపోతాము. జీవితం మీకు భిన్నమైన పరిస్థితులను చూపుతుంది. ఒకసారి పట్టలేని సంతోషం ఇస్తుంది. ఒక్కోసారి ఓర్చుకోలేని బాధని ఇస్తుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.. సంతోషం అయినా, బాధ అయినా అవి ఎప్పటికీ టెంపరరీనే.

ట్రెండింగ్ వార్తలు

Single Reasons : మీరు సింగిల్‌గా ఉండడానికి ఈ 5 అంశాలు కారణం కావొచ్చు

Brinjal Chutney : 4 వంకాయలు ఉడకబెట్టి ఇలా చట్నీ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు

Ginger Garlic Paste: అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేయడం మంచి పద్ధతి కాదా? పోషకాలు తగ్గుతాయా?

Nuts for one Month: ఒక నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం గుప్పెడు నట్స్ తినండి మార్పును మీరే గమనించండి

సంతోషంగా ఉన్నామని పొంగిపోయేలోపు.. బాధ వచ్చేస్తుంది. అలాగే బాధలో ఉన్నప్పుడు హ్యాపినెస్ ఇచ్చే ఏదొక అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తీసుకుందాం. లాస్ట్ టైం ఇండియా గెలిచింది. కానీ తాజాగా మన మనసులు గెలిచింది. అంతే నెక్స్ట్ట్ టైమ్ మ్యాచ్ గెలవొచ్చు. లేదా మనసులు గెలవవచ్చు. కానీ మన చేతుల్లో లేని అంశాల గురించి ఆలోచిస్తూ కుర్చొంటే ఏమి లాభం. అనవసరమైన ఒత్తిడి తప్పా.. అతిగా ఆలోచిస్తే బీపీలు, షుగర్లు తప్పా.. ఏమి ప్రయోజనాలు రావు.

సమస్య ఏమిటంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు నిజమైన సంతోషాలను కూడా దూరం చేసేసుకునే అవకాశముంది. మీకు అది సంతోషం ఇస్తుందని తెలియక మీరే మీ ఒత్తిడితో బిజీగా ఉంటారు. ఇది మీ వైఫల్యానికి దారి తీస్తుంది. అప్పుడు మీరు మీ ఓటమిని ఒప్పుకోవాలి. ఎందుకంటే దానికి కారకులు మీరే అవుతారు కాబట్టి.

ప్రతిరోజూ మనకి ఇదే పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి సూర్యోదయం ఓ కొత్తరోజును ఇస్తుంది. అది ఎక్కువసేపు ఉండదు. సాయంత్రం ఆ రోజును తీసుకెళ్లిపోతుంది. పోని ఆ రాత్రైనా శాశ్వతంగా ఉంటుందా అంటే లేదు. ఎందుకంటే మరుసటి రోజు మళ్లీ ఓ కొత్త హోప్ ఇస్తుంది. కొత్త రోజు అనుకుని సంబరపడేలోపు ఓ రోజు గడిచిపోయిందనే బాధ ఎక్కువ అవుతుంది. టెక్నికల్, నిజంగా మాట్లాడుకుంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఏదైనా శాశ్వతంగా మీతో ఉంటుంది అంటే.. అది మీరు మాత్రమే. అవును మీ జీవిత చక్రంలో మీకు ఏదైనా పర్మినెంట్ ఉంది అది మీరే. మీరు మాత్రమే మీ చావు వరకు తోడుంటారు.

తదుపరి వ్యాసం