తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ambani Makeup Artist: అంబానీ ఆడపడుచుల మేకప్ ఆర్టిస్ట్ ఈయన, ఒకరికి మేకప్ వేసేందుకు ఎంత తీసుకుంటాడంటే...

Ambani makeup artist: అంబానీ ఆడపడుచుల మేకప్ ఆర్టిస్ట్ ఈయన, ఒకరికి మేకప్ వేసేందుకు ఎంత తీసుకుంటాడంటే...

Haritha Chappa HT Telugu

05 March 2024, 11:40 IST

    • Nita ambani makeup artist: అంబానీలు పేరు చెబితేనే అనంతమైన కోటీశ్వరులు గుర్తుకు వస్తారు. అంబానీల ఇంట్లో ఆడవాళ్ళ మేకప్ ఆర్టిస్టులు, డ్రెస్ డిజైనర్లు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ మందిలో ఉంటుంది.
నీతా అంబానీతో మిక్కీ కాంట్రాక్టర్
నీతా అంబానీతో మిక్కీ కాంట్రాక్టర్ (Instagram)

నీతా అంబానీతో మిక్కీ కాంట్రాక్టర్

Nita ambani makeup artist: ఏ కార్యక్రమానికి హాజరైన అంబానీల ఇంటి కోడళ్లు, కూతుళ్లు కెమెరాలను ఇట్టే ఆకట్టుకుంటారు. నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా మెహతా... ఇప్పుడు రాధిక మర్చంట్... వీరందరూ తల తిప్పలేనంత అందంగా ముస్తాబై కనిపిస్తారు. వీరికి ఎన్నో ఏళ్లుగా మేకప్ చేస్తున్నది ఒకే వ్యక్తి. ఈయన్ని హై ప్రొఫైల్ మేకప్ ఆర్టిస్ట్ గా చెప్పుకోవచ్చు. పేరు మిక్కి కాంట్రాక్టర్. అంబానీలకు ఏ కార్యక్రమమైనా మేకప్ చేసేది ఈయనే. మన దేశంలోని హై ప్రొఫైల్ మేకప్ ఆర్టిస్టుల్లో మిక్కీ ఒకరు.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

ముప్పై ఏళ్లకు పైగా మిక్కీ ఇదే రంగంలో ఉన్నారు. బాలీవుడ్ లో కూడా తన సత్తాను చాటారు. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టుగా మంచి పేరును సంపాదించారు. అతను తొలిసారిగా 1992లో ‘బేఖుడి’ అనే చిత్రంలో కాజోల్‌కు మేకప్ వేశారు. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ ప్రముఖులతో పాటు, అంబానీలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నో సినిమాలకు ఆయన మేకప్ ఆర్టిస్టుగా పనిచేశారు.

దీపికా పడుకునే, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్, కాజోల్, అనుష్క శర్మ వంటి బాలీవుడ్ హీరోయిన్లతో పాటు అనన్య పాండే, జాన్వీ కపూర్ వంటి నేటి యువ తారలకు కూడా ఆయన పర్సనల్ మేకప్ ఆర్టిస్టుగా ఉన్నారు. నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా మెహతా ఎక్కడికి వెళ్లాలన్న మేకప్ ఆర్టిస్ట్ గా ఈయననే ఎంచుకుంటారు.

ఎంత ఛార్జ్ చేస్తారు?

మనదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మేకప్ ఆర్టిస్టుల్లో మిక్కీ కాంట్రాక్టర్ ఒకరు. ఆయన ఒకసారి మేకప్ చేసినందుకు లక్ష రూపాయలు వరకు వసూలు చేస్తారు.

ఈయన మొదట్లో జపాన్లోని టోక్యోలో హెయిర్ డ్రెస్సర్‌గా పని చేసేవారు. అక్కడ నుంచి ముంబై చేరి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అతని మేకప్ ఎక్కువ మందికి నచ్చడంతో కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ గమ్, మొహబ్బతేన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్ వంటి ఎన్నో సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్ గా పని చేశారు.

ఇప్పుడు రాధిక మర్చంట్ - అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఎంతో మంది సెలెబ్రిటీలకు మేకప్ చేస్తూ చాలా బిజీ అయిపోయారు మిక్కీ. కొత్త కోడలు రాధికాకు మేకప్ చేసింది ఈయన. ఇక అందాల అత్తగారు నీతా అంబానీని తీర్చిదిద్దిన ఘనత మిక్కీకే దక్కింది. నీతాకు వెస్ట్రాన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా... ఎంతో అందంగా మేకప్ చేయడంలో మిక్కీ దిట్ట.

టాపిక్

తదుపరి వ్యాసం