తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Idli: రాగి ఇడ్లి.. ఇన్స్టంట్ ఇడ్లి

ragi idli: రాగి ఇడ్లి.. ఇన్స్టంట్ ఇడ్లి

16 May 2023, 6:30 IST

  • ragi idli: రాగిపిండితో ఇడ్లీలు పిండి పులియబెట్టకుండా, వెంటనే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. 

రాగి ఇడ్లి
రాగి ఇడ్లి

రాగి ఇడ్లి

రాగుల్లో పోషకాలు చాలా ఉంటాయి. మధుమేహులకు కూడా ఇది చాలా మంచిది. రాగి అంబలే కాకుండా ఒకసారి రాగిపిండితో ఇడ్లీలు కూడా చేసుకుని చూడండి. రవ్వ, పెరుగుతో కలిపి చేయడం వల్ల వీటికి మంచి రుచి వస్తుంది. నూనె లేకుండా, పిండి పులియ బెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే చేసుకునే ఇడ్లీ ఇది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు రాగి పిండి

1 కప్పు సన్నం రవ్వ

తగినంత ఉప్పు

1 కప్పు పెరుగు

1 కప్పు నీళ్లు

పావు టీస్పూన్ బేకింగ్ సోడా

రాగి ఇడ్లీ తయారీ విధానం:

  1. ముందుగా నూనె లేకుండా రవ్వను రెండు నిమిషాలు వేయించాలి.
  2. పెద్ద గిన్నెలోకి రవ్వను తీసుకుని రాగిపిండిని కలుపుకోవాలి. ఉప్పు, పెరుగు కూడా కలుపుకోవాలి.
  3. పెరుగు చిక్కదనాన్ని బట్టి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోండి. ఈ పిండిని అరగంట పక్కకు పెట్టుకోండి.
  4. అరగంటయ్యాక, అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండిలా కలుపుకోండి.
  5. ఆవిరి మీద ఇడ్లీ ఉడికించుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా కూడా కలుపుకోండి.
  6. ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీ పాత్రలకి నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోండి. మామూలు ఇడ్లీ లాగే ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. రాగి పిండి ఇడ్లీలు సిద్ధం. వీటిని సాంబార్, చట్నీతో సర్వ్ చేసుకోండి.

తదుపరి వ్యాసం