తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Dosa: బరువు తగ్గించే ఓట్స్ దోశ..

oats dosa: బరువు తగ్గించే ఓట్స్ దోశ..

02 May 2023, 6:30 IST

  • oats dosa:  ఎప్పుడూ ఒకే రకం దోసెలు కాకుండా ఒకసారి ఓట్స్‌తో చేసిచూడండి. పిండి పులియాల్సిన అవసరం లేకుండా వెంటనే చేసుకోగలిగే సులభమైన అల్పాహారం ఇది. 

ఓట్స్ దోశ
ఓట్స్ దోశ (Pexels)

ఓట్స్ దోశ

బరువు తగ్గాలనుకున్నప్పుడు ఉదయాన్నే అల్పాహారం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు, కార్బోహైడ్రేట్లు ఉండే ఓట్స్ తో దోశ చేసి చూడండి. తయారీ కూడా సులభమే.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కావాల్సిన పదార్థాలు:

ఓట్స్ - సగం కప్పు

బియ్యం పిండి - పావు కప్పు

రవ్వ - పావు కప్పు

పెరుగు - సగం కప్పు

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు

తరగిన అల్లం- 1 టీస్పూను

పచ్చిమిర్చి ముక్కలు - 1 టీస్పూను

సన్నగా తరిగిన కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్

కరివేపాకు - 7 ఆకులు

జీలకర్ర - సగం టీస్పూను

మిరియాల పొడి - పావు టీస్పూను

నీళ్లు- రెండు కప్పులు

ఉప్పు- తగినంత

నెయ్యి లేదా నూనె - మూడు స్పూన్లు

తయారీ విధానం:

step 1: ఓట్స్ మిక్సీ పట్టుకుని పిండిలాగా చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె లోకి తీసుకోండి. దీంట్లోనే బియ్యంపిండి, రవ్వ(సన్నం) కలుపుకోవాలి.

step 2: కొద్దిగా పెరుగు, పావు కప్పు నీళ్లు పోసుకుని పిండి లాగా కలుపుకోవాలి. పుల్లగా కావాలనుకుంటే ఇంకాస్త పెరుగు కూడా కలుపుకోవచ్చు.

step 3: పిండిలో సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కలుపుకోవాలి.

step 4: జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు కలిపి పూర్తిగా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

step 5: పిండి పలుచగా ఉండాలి. చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. పెనం పెట్టుకుని వేడయ్యాక పిండిని పలుచగా పొరలాగా వేసుకుంటూ పోవాలి. ప్రతిసారీ దోసె పోసే ముందు అడుగు నుంచి పిండిని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పిండి మొత్తం అడుగుకు వెళ్లిపోతుంది. ఈ దోసెల్ని కొబ్బరి చట్నీతో లేదా పల్లి చట్నీతో తినొచ్చు.

తదుపరి వ్యాసం