తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Summer Drinks | సమ్మర్​లో వేడిని తగ్గించే.. తక్కువ కేలరీలున్న పానీయాలు ఇవే..

Summer Drinks | సమ్మర్​లో వేడిని తగ్గించే.. తక్కువ కేలరీలున్న పానీయాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

29 March 2022, 14:03 IST

    • మార్చ్ పూర్తవకముందే ఎండలు అమ్మో అనిపిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడమంటే సాహసమనే చెప్పాలి. ఇంట్లో బయట ఉన్నా.. బయటకు వెళ్లినా.. ప్రాణం చల్లగా ఏదైనా తాగాలని కోరుకుంటుంది. కానీ ఏమి తాగాలన్నా కేలరీల భయం వెంటాడుతుంది. ఫిట్​నెస్​ మీద ఎక్కువ శ్రద్ధ వహించే వారి కోసం తక్కువ కేలరీల పానీయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు కూడా ఓ సిప్ వేయండి.
వేసవి వేడిని తగ్గించే డ్రింక్స్
వేసవి వేడిని తగ్గించే డ్రింక్స్

వేసవి వేడిని తగ్గించే డ్రింక్స్

Low Calorie Drinks | వేసవి వేడిని తగ్గించే ఓ తేలికైన.. కేలరీలు తక్కువ ఉండే.. రిఫ్రెష్​నిచ్చే.. ఫిజీ డ్రింక్ మీ చేతిలో ఉంటే.. ఆహా సమ్మర్​లో శీతాకాలాన్ని చూసినట్లే ఉంటుంది కదా. కానీ ఏ కూల్​ డ్రింక్ తాగాలన్నా కేలరీల భయం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే వేసవి వేడిని తట్టుకునేందుకు.. మీ ఫిట్​నెస్​ను కాపాడుకునేందుకు ఫిట్‌నెస్ నిపుణులు తక్కువ కేలరీల పానీయాలు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Bed Time Habit : మీకు రాత్రిపూట ఈ అలవాటు ఉంటే.. అది బంధానికి విలన్

Capsicum Pachadi: స్పైసీగా క్యాప్సికం పచ్చడి ఇలా చేసుకోండి, చూడగానే నోరూరిపోతుంది

Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

1. అల్లం ఆలే

అల్లం ఆలే. భలే అనిపించే లక్షణాలు అన్ని దీనిలో ఉన్నాయి. పైగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే అద్భుతమైన పానీయం ఇది. దీనిని అల్లరసం, క్లబ్ సోడా, నిమ్మరసం, తేనేతో తయారు చేస్తారు. అల్లం రసం, నిమ్మకాయ, తేనే, క్లబ్​ సోడా కలిపాలి. అంతే దీనిని తాగడమే ఆలస్యం.

బెనిఫిట్స్

అల్లం కండరాల నొప్పులను తగ్గించి... నోటి దుర్వాసనతో పోరాడుతుంది. క్యాన్సర్ నివారణకు, మంటను తగ్గించడానికి, అంతేకాకుండా బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి.. కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ఇంకేముంది వేసవి వేడితో పాటు.. కొలెస్ట్రాల్​ను కూడా అదుపులో ఉంచుకునేందుకు దీనిని ట్రై చేయండి.

2. ఆమ్ పన్నా

ఆమ్ పన్నా. వేసవి వేడిని అరికట్టేందుకు అత్యంత ప్రసిద్ధి పొందిన పానీయాలలో ఇది ఒకటి. ఈ పానీయాన్ని పచ్చి మామిడి పండ్లతో తయారు చేస్తారు.

కావాల్సిన పదార్థాలు

* పచ్చి మామిడి - పెద్దది 1

* కప్పు - బెల్లం

* యాలకుల పొడి - 1 స్పూన్

* జీలకర్ర పొడి -¼ టీస్పూన్

* మిరియాల పొడి - టీ స్పూన్

* ఉప్పు - 1 టీ స్పూన్

* నీరు - 2 కప్పులు

* పుదీనా ఆకులు - 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

పచ్చి మామిడిని కడిగి.. ముక్కలుగా చేసి.. ప్రెషర్‌లో కుక్కర్‌లో వేసి.. 2 కప్పుల నీరు వేయాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారక ఉడికిన మామిడి గుజ్జును బ్లెండర్‌లో వేయాలి. దానిలో తాజా పుదీనా, ¼ కప్పు బెల్లం జోడించాలి. నీరు కలపకుండా మృదువైన పేస్ట్​లా చేయాలి. రుచికి తగ్గట్లు యాలకుల పొడి, ½ జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు జోడించాలి. బాగా కలిపి.. గ్లాస్​లో సర్వ్ చేయాలి. దీనిలో చల్లని క్యూబ్స్ లేదా చల్లని నీరు పోసి కలిపి.. పుదీనా ఆకులతో అలంకరించాలి. అంతే తాగడానికి ఆమ్ పన్నా రెడీ అయినట్లే.

బెనిఫిట్స్

ఈ రుచికరమైన డ్రింక్ విటమిన్ ఏ, బి1, బి2, సి లను కలిగి ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లు, అవసరమైన ఖనిజాలకు మంచి మూలం. ఈ పానీయం కంటి చూపునకు కూడా మంచిది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం