తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kodiguddu Methi Kura: కోడిగుడ్డు మెంతికూర ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు, చూస్తేనే నోరూరిపోతుంది

Kodiguddu Methi Kura: కోడిగుడ్డు మెంతికూర ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు, చూస్తేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu

02 March 2024, 17:30 IST

    • Kodiguddu Methi Kura: కోడిగుడ్డు మెంతికూర కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కూరను వేసుకొని తింటే ఆ రుచే వేరు. కోడిగుడ్డు మెంతికూర రెసిపీ చాలా సులువు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కోడిగుడ్డు మెంతికూర రెసిపీ
కోడిగుడ్డు మెంతికూర రెసిపీ (Youtube)

కోడిగుడ్డు మెంతికూర రెసిపీ

Kodiguddu Methi Kura: కోడిగుడ్డు సంపూర్ణ భోజనం. ఇక మెంతికూర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండూ కలిస్తే అది కచ్చితంగా పోషకాలు నిండిన ఆహారం అనే చెప్పాలి. ఎప్పుడూ ఒకేలాగా కోడిగుడ్డు కూర వండుకుంటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి కోడిగుడ్డు మెంతికూరను కలిపి వండండి. ఆ రుచే వేరు. మెంతికూరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పెద్ద ఆకులతో ఉంటే, ఇంకోటి చిన్న ఆకులతో ఉంటుంది. పెద్ద మెంతి ఆకు కూర చేదు తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్నే తీసుకోండి. ఈ కూరలో మనం టమోటోలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉల్లిపాయలు వంటివన్నీ వేస్తాము. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇప్పుడు కోడిగుడ్డు మెంతికూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

కోడిగుడ్డు మెంతికూర రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు - నాలుగు

మెంతికూర - రెండు కట్టలు

టమోటాలు - మూడు

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

గరం మసాలా - పావు స్పూను

పచ్చిమిర్చి - మూడు

పసుపు - పావు స్పూను

కసూరి మేథి - రెండు స్పూన్లు

నీళ్లు - తగినన్ని

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - మూడు స్పూన్లు

కోడిగుడ్డు మెంతికూర కర్రీ రెసిపీ

1. కోడిగుడ్లను ఉడికించుకొని నాలుగు వైపులా గాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

3. కాస్త పసుపు వేసి కోడిగుడ్లను వేసి వేయించండి.

4. పసుపు రంగులోకి మారిన కోడిగుడ్లను తీసి పక్కన పెట్టుకోండి.

5. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం నూనె వేసి వేడి చేయండి.

6. అందులో జీలకర్రను వేసి చిటపటలాడనివ్వండి.

7. తరువాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించండి.

8. ఉల్లిపాయ కాస్త రంగు మారేవరకు ఉంచండి.

9. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోండి.

10. ఒక రెండు నిమిషాలు అది వేగాక ధనియాలపొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, గరం మసాలా వంటివన్నీ వేసుకుని బాగా కలుపుకోండి.

11. ఇప్పుడు మెంతికూర తరుగును వేసి బాగా కలిపి పైన మూత పెట్టండి.

12. మంట చిన్నగా పెట్టుకోండి, లేకపోతే మెంతికూర మాడిపోయే అవకాశం ఉంది.

13. కాసేపు అయ్యాక టమోటో గుజ్జును వేసి బాగా కలుపుకోండి.

14. రుచికి సరిపడా ఉప్పును, కసూరి మేథిని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టండి.

15. ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. కాసేపటికి నూనె పైకి తేలి ఇగురులాగా అవుతుంది.

16. అప్పుడు ఈ కోడిగుడ్లను అందులో వేసుకోండి. మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించండి.

17.అంతే కోడిగుడ్డు మెంతికూర రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

కోడిగుడ్డు మెంతికూరలో మనం ఉపయోగించినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మెంతికూర విషయానికి వస్తే అది చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. పక్షవాతం, మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి వంటివన్నీ రాకుండా అడ్డుకుంటుంది. కడుపు ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడేవారు. మెంతికూరను ఎంత తింటే అంత మంచిది. నిజానికి మెంతికూరను ప్రతిరోజు తింటే ఎంతో ఆరోగ్యం. కానీ దీన్ని తినేవారి సంఖ్య తక్కువగానే ఉంది. కేవలం పప్పులో మెంతాకు వేసుకొని వండడమే తప్ప, మెంతికూరను ప్రత్యేకంగా వండిన వారు లేరు. ఒకసారి ఇలా కోడిగుడ్డు మెంతికూరను వండుకొని చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. వారంలో కనీసం రెండుసార్లు ఇలా కోడిగుడ్డు మెంతికూర తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా పిల్లలకు దీనికి తినిపించడం చాలా ముఖ్యం.

తదుపరి వ్యాసం