తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moto G82 5g । ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాకు లేదు సాటి, స్పీకర్లకు లేదు పోటీ!

Moto G82 5G । ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాకు లేదు సాటి, స్పీకర్లకు లేదు పోటీ!

HT Telugu Desk HT Telugu

07 June 2022, 16:23 IST

    • మోటోరోలా కంపెనీ Moto G82 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో కెమెరా, డాల్బీ అట్మోస్ స్పీకర్లు ప్రత్యేక ఆకర్షణ. ధరెంత, డిస్కౌంట్లు ఏమున్నాయి తదితర వివరాలు తెలుసుకోండి..
Moto G82 5G
Moto G82 5G

Moto G82 5G

మొబైల్ తయారీదారు మోటోరోలా కంపెనీ ఇటీవలే Moto G82 పేరుతో ఒక 5G స్మార్ట్‌ఫోన్‌ను యూరోప్ దేశాలలో విడుదల చేసింది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లోనూ విడుదల చేసింది. అయితే కొన్ని ఫీచర్లలో యూరోపియన్ వెర్షన్ కంటే ఇండియన్ వెర్షన్ ఫోన్ విభిన్నంగా ఉంది. ఇక్కడ విడుదలయిన అదే ఫోన్‌లో 10-బిట్ పోలెడ్ pOLED డిస్‌ప్లే, 50 మెగా పిక్సెల్ OIS కెమెరా ఇచ్చారు. ఇటువంటి కెమెరా సెటప్‌తో అత్యంత చౌకైన ఫోన్‌ ఇప్పటివరకు ఇదే.

Moto G82 5G ర్యామ్ ఆధారంగా రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ సహా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌గా SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు Moto G82 5Gపై రూ.1,500 తగ్గింపు ఉంది. అలాగే రిలయన్స్ జియో వినియోగదారులు కూడా రూ. 5,049 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత తదితర వివరాలను ఈ కింద తెలుసుకోండి.

Moto G82 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల 10-bit pOLED FHD+ డిస్‌ప్లే
  • 6GB/8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 50 MP + 8MP + 2MP కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 30W ఛార్జర్
  • 6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 21,499/-
  • 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 22,999/-

Moto G82 5G మెటొరైట్ గ్రే, లిల్లీ వైట్ అనే రెండు కలర్ ఛాయిస్‌లలో లభిస్తోంది.

కనెక్టివిటీ పరంగా Moto G82లో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, NFC, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 

Moto G82 5G డ్యుయల్ స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది, ఇవి డాల్బీ అట్మోస్ సౌండ్ విడుదల చేస్తాయి. బోర్డులో రెండు మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి.Moto G82 మెటొరైట్ గ్రే, లిల్లీ వైట్ అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తోంది. జూన్ 14 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం