తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Rasam: టమాటా చారు ఈ టిప్స్‌తో చేయండి.. అమోఘంగా ఉంటుంది..

Tomato Rasam: టమాటా చారు ఈ టిప్స్‌తో చేయండి.. అమోఘంగా ఉంటుంది..

17 December 2023, 11:00 IST

  • Tomato Rasam: నోరూరించే టమాటా చారు రుచిగా రావాలంటే పక్కా కొలతలతో సహా తయారీ చూసేయండి. తయారీ చాలా సులభంగా పదినిమిషాల్లో రెడీ అయిపోతుంది.

టమాటా చారు
టమాటా చారు (freepik)

టమాటా చారు

వేపుళ్లు చేసుకున్నప్పుడు అన్నంలోకి సాంబార్, పప్పు లేదా ఏదైనా చారు ఉండాల్సిందే. పుల్లపుల్లగా ఉండే టమాటా చారు చాలా మందికి ఇష్టమే. అయితే టమాటా చారు రుచి సార్లు సరిగ్గా కుదరదు. ఈ సింపుల్ టిప్స్, కొలతలు పాటించి చేస్తే రుచిగా చారు చేసేయొచ్చు. దీన్ని ఈ శీతాకాలంలో సాయంత్రం పూట చేసుకుని సూప్ లాగా కొన్ని బ్రెడ్ ముక్కలు వేసుకుని తాగేయొచ్చు కూడా. దాని తయారీ ఎలాగో చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

టమాటా చారు తయారీకి కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ బాగా పండిన టమాటాలు, ముక్కలుగా చేసుకోవాలి

సగం కప్పు కొత్తిమీర తరుగు

10 వెల్లుల్లి రెబ్బలు

ఇంచు అల్లం ముక్క, తరుగు

అరచెంచా జీలకర్ర

పావు చెంచా మిరియాలు

1 చెంచా వంటనూనె

పావు టీస్పూన్ ఆవాలు

పావు చెంచా మినప్పప్పు

2 ఎండుమిర్చి

చిటికెడు ఇంగువ

1 కరివేపాకు రెబ్బ

పావు చెంచా పసుపు

తగినంత ఉప్పు

టమాటా చారు తయారీ విధానం:

  1. ముందుగా ఒక మిక్సీ జార్‌లో కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీలకర్ర, మిరియాలు వేసుకోవాలి.
  2. వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  3. అదే జార్‌లో టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకాస్త రుచి పెరగాలంటే ముందుగానే టమాటాలను నీళ్లలో రెండు నిమిషాలు ఉడికించి మిక్సీ పట్టుకోవచ్చు.
  4. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. మినప్పప్పు, కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. వెంటనే ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలి.
  5. ఇప్పుడు కాస్త బరకగా పట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. చిన్న మంట మీద ఒకనిమిషం పాటూ కలియబెట్టాలి.
  6. కాస్త పసుపు కూడా వేసి కలుపుకుని టమాటా గుజ్జు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒక నిమిషం సన్నం మంట మీద ఉడికాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  7. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసుకుని రసం చిక్కదనాన్ని రుచికి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఈ నీళ్లలో ఫ్లేవర్లు పట్టేదాక కనీసం పదినిమిషాలు సన్నం మంట మీద రసాన్ని ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే చాలు. టమాటా చారు రెడీ.

తదుపరి వ్యాసం