Tomato Poori: ఒకసారి టమాటా పూరీలు ప్రయత్నించండి.. మామూలు పూరీలు నచ్చవిక..-process of making tomato poori for quick breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Poori: ఒకసారి టమాటా పూరీలు ప్రయత్నించండి.. మామూలు పూరీలు నచ్చవిక..

Tomato Poori: ఒకసారి టమాటా పూరీలు ప్రయత్నించండి.. మామూలు పూరీలు నచ్చవిక..

Tomato Poori: టమాటాల ఫ్లేవర్‌తో చేసే టమాటా పూరీలు రుచిలో చాలా బాగుంటాయి. వాటిని తయారు చేసుకునే విధానం ఏంటో వివరంగా తెల్సుకోండి.

టమాటా పూరీ

పూరీలు ఎప్పుడూ ఒకేలా తినడం కన్నా అందులో వివిధ రకాలు ప్రయోగాలు చేస్తుంటే కొత్తగా అనిపిస్తాయి. మామూలుగా పాలకూర, మెంతి కూర వేసుకుని పూరీలు చేస్తుంటాం. అయితే ఒకసారి టమాటా రసం కలిపి పూరీలు చేసుకొని చూడండి. వీటిని ఏ కర్రీ అవసరం కూడా లేదు. తింటుంటే మసాలా పూరీల్లాగా అనిపిస్తాయి. వాటిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు గోధుమపిండి

2 చెంచాల రవ్వ

2 టమాటాలు

1 చెంచా కారం

తగినంత ఉప్పు

పావు టీస్పూన్ ఇంగువ

2 చెంచాల కొత్తిమీర తరుగు

పావు చెంచా పసుపు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

తయారీ విధానం:

  1. ముందుగా బాగా పండిన టమాటాలు తీసుకుని వాటిని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, టమాటా రసం, వాము, ఉప్పు, కారం పొడి, పసుపు, కొత్తిమీర వేసుకోవాలి.
  3. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీలు వచ్చేలాగా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి.
  4. పిండిని చిన్న ఉండల్లాగా చేసుకుని పూరీల్లాగా ఒత్తుకోవాలి. కాగుతున్న నూనెలో వేసుకుని తీసుకోవాలి.
  5. ఈ పూరీలను వేడివేడిగా అయినా, లంచ్ బాక్స్ లోకి అయినా తీసుకెళ్లొచ్చు. జతగా ఆలూ కూర్మా లేదా పన్నీర్ కూర్మా.. ఏదైనా బాగుంటుంది.