తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Irctc ఫారెన్ టూర్ ఆఫర్.. ఆరు రోజుల యాత్ర కోసం బడ్జెట్ ధరలోనే ప్యాకేజీ

IRCTC ఫారెన్ టూర్ ఆఫర్.. ఆరు రోజుల యాత్ర కోసం బడ్జెట్ ధరలోనే ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu

28 April 2022, 21:38 IST

    • విదేశీ యాత్ర చేయాలనుకునే వారికి భారతీయ రైల్వేలకు చెందిన IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అంతర్జాతీయ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ప్రయాణ సౌకర్యాలు, వసతులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి...
Nepal
Nepal (Unsplash)

Nepal

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ వేసవి సీజన్ కోసం బడ్జెట్ ధరలో ఒక ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియా నుంచి నేపాల్‌కు విమానయానం ద్వారా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. మొత్తం టూర్ 6 రోజులు 5 రాత్రులు ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర అని చెప్పవచ్చు. ఈ యాత్రలో యాత్రికులకు నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం, బౌధనాథ్ స్థూపం, దర్బార్ స్క్వేర్ సహా పోఖారాలోని వివిధ ప్రదేశాలకు తీసుకువెళతారు.

ఈ ఆధ్యాత్మిక యాత్ర జూన్ 19 నుంచి ప్రారంభమై జూన్ 24న ముగుస్తుంది. టికెట్స్ బుక్ చేసుకున్న యాత్రికులను లక్నోలోని అమౌసి విమానాశ్రయం నుంచి ఖాట్మండుకు విమానాల్లో తీసుకు వెళ్తారని IRCTC చీఫ్ రీజినల్ మేనేజర్ (లక్నో) అజిత్ కుమార్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.

వారం రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం ఒక్కో వ్యక్తికి రూ. 48,500 ఛార్జ్ అవుతుంది. ఒకవేళ ఇద్దరూ కలిసి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ. 39,000 ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మందితో గ్రూప్‌గా ఏర్పడి బుక్ చేసుకుంటే ధరలు మరింత తగ్గుతాయని సిన్హా చెప్పారు.

ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారందరికీ యాత్ర కొనసాగినన్నీ రోజులు త్రీ-స్టార్ హోటల్‌లో వసతితో పాటు భారతీయ ఆహారం అందిస్తామని అధికారులు తెలిపారు.

తాము ప్రవేశపెట్టిన ఈ ప్యాకేజీకి స్పందన బాగుంటే మరిన్ని ప్యాకేజీలతో ముందుకు వస్తామని IRCTC పేర్కొంది.

టాపిక్

తదుపరి వ్యాసం