తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hyundai Ioniq 6 । హ్యుందాయ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ సెడాన్.. టెస్లా మోడల్ 3కి పోటీ

Hyundai Ioniq 6 । హ్యుందాయ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ సెడాన్.. టెస్లా మోడల్ 3కి పోటీ

HT Telugu Desk HT Telugu

14 July 2022, 15:12 IST

    • హ్యుందాయ్ తమ తొలి ఎలక్ట్రిక్ సెడాన్ కార్ Hyundai Ioniq 6ని విడుదల చేసింది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 610 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఈ స్టోరీ చదవండి.
Hyundai Ioniq 6
Hyundai Ioniq 6

Hyundai Ioniq 6

ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ మోటార్ తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ కార్ 'హ్యుందాయ్ ఐయోనిక్ 6' (Hyundai Ioniq 6)ని విడుదల చేసింది. ఈ సరికొత్త కార్ ప్రస్తుతం EV మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న టెస్లా మోడల్ 3 కంటే మెరుగైన రేంజ్ కలిగి ఉంది. టెస్లా మోడల్ 3 కారు ఒక్క ఫుల్ ఛార్జ్‌పై 602 కి.మీ. రేంజ్ కలిగి ఉండగా, తాజాగా రిలీజైన హ్యుందాయ్ ఐయోనిక్ 6 కారు ఫుల్ ఛార్జ్ మీద 610 కిమీల రేంజ్‌ను కలిగి ఉంది. అంతేకాదు హ్యుందాయ్ ప్రకారం ఈ Ioniq 6 `ఎలక్ట్రిఫైడ్ స్ట్రీమ్‌లైనర్` కేవలం 5.1 సెకన్లలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Ioniq 6 అనేది EV మార్కెట్లో గ్లోబల్ లీడర్‌గా నిలబడటానికి హ్యుందాయ్ మోటార్ రూపొందించిన వ్యూహంలో ప్రతిష్టాత్మక అడుగు. విశాలమైన ఇంటీరియర్, మెరుగైన పనితీరులో స్థిరత్వం కలిగి ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో కస్టమర్ల విలువలకు అనుగుణంగా ఈ కారును రూపొందించినట్లు హ్యుందాయ్ పేర్కొంది.

Hyundai Ioniq 6 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ కార్ 53-kWh ఇంకా 77.4 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) ద్వారా అల్ట్రా-ఫాస్ట్, మల్టీ-ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 350-kW ఛార్జర్‌తో IONIQ 6ను కేవలం 18 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఈ కారు 12 రంగులలో అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా Ioniq 6 మరేతర ఎలక్ట్రిక్ కారులో లేనట్లుగా అత్యున్నతమైన ఏరోడైనమిక్ స్టైలింగ్‌ను కలిగి ఉంది.

డ్యూయల్ కలర్ యాంబియంట్ లైటింగ్, స్పీడ్ సింక్ లైటింగ్, EV పెర్ఫార్మెన్స్ ట్యూన్-అప్, ఎలక్ట్రిక్ యాక్టివ్ సౌండ్ డిజైన్ (e-ASD) వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ కారు విక్రయాలు వచ్చే ఏడాది ప్రారంభంలో USలో మొదలవుతాయి. అయితే Ioniq 6 ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం