తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Belly Fat Tips : వారం రోజుల్లో ఈ చిట్కాలతో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు!

Belly Fat Tips : వారం రోజుల్లో ఈ చిట్కాలతో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు!

Anand Sai HT Telugu

20 February 2024, 19:30 IST

    • Belly Fat Reduce Tips : బెల్లీ ఫ్యాట్‌తో ఈరోజుల్లో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వారం రోజుల్లోనే తగ్గించుకోవచ్చు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కాలు
బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కాలు (Unsplash)

బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కాలు

బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందికి ఉన్న సమస్య. ఎక్కువగా కూర్చొవడం, సరైన జీవనశైలి లేకపోవడం కారణంగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. బొడ్డు కొవ్వు అనేది ఆధునిక జీవితంలో అతిపెద్ద సమస్యగా మారింది. నిరంతరం కూర్చోవడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అయితే బొడ్డు కొవ్వును తగ్గించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే.. నిర్దిష్టమైన డైట్ ప్లాన్‌ను సమయానికి అనుసరించడం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

చాలా మంది పొట్ట తగ్గించుకోవడానికి డైట్, ఫాస్టింగ్, వ్యాయామం, మెడిసిన్ ఇలా ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యమైన అంశం. రెగ్యులర్ గా డైట్ ఫాలో కావడం వలన కొవ్వు సులభంగా తగ్గుతుంది. అందుకోసం ఈ చిట్కాలు పాటించండి..

ఇది ఫాలో అయిపోండి

ఉదయం 7 గంటలకు ఒక గ్లాసు నిమ్మకాయ, దాల్చినచెక్క కలిపిన నీరు తాగాలి.

ఉదయం ఒక వెజిటబుల్ శాండ్‌విచ్, ఒక గ్లాస్ స్కిమ్డ్ మిల్క్

11 గంటలకు సీజన్‌లో పండ్లు తీసుకోవాలి(మితంగా).

మధ్యాహ్నం 1 గంటలకు కొంచెం కిచిడీ తినండి. ఒక గిన్నె పుల్లని పెరుగు, సలాడ్‌ తీసుకోండి.

మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక గ్లాసు మజ్జిగ.

సాయంత్రం 4 గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ

సాయంత్రం 5 గంటలకు ఉడికించిన శనిగలు ఓ చిన్న గిన్నే.

రాత్రి 8 గంటలకు రెండు రొట్టెలు, ఒక గిన్నె జున్ను. తర్వాత దోసకాయ కొంచెం తినండి.

బయట తిండి అస్సలు వద్దు

కొవ్వును తగ్గించేందుకు బియ్యం, కేకులు, బ్రెడ్, బిస్కెట్లు వంటి కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించాలి. పంచదారతో కూడిన పదార్థాలు తినడం సరికాదు. ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి. నెయ్యి, వెన్న ముట్టుకోవద్దు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నీరు ఎక్కువగా తాగాలి. గ్రీన్ టీ కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. కావాలంటే రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తాగవచ్చు.

ఉదయం గ్లాసు నీరు తాగండి

పైన చెప్పిన విషయాలతోపాటుగా మరికొన్ని చిట్కాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్లు తాగితే మంచిది. అందులో కాస్త నిమ్మరసం పిండితే జీవక్రియ రేటు పెరుగుతుంది. ఈ తాజా పానీయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటూ ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని మళినాలను బయటకు పంపించే డిటాక్సిఫయర్ లాగా ఉంటుంది.

వ్యాయామం తప్పనిసరి

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు వ్యాయామాలు కూడా చాలా అవసరం. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వేగంగా నడవడం, యోగా చేయడం చేయాలి మరీ ముఖ్యంగా ప్లాంక్ చేయడం మరిచిపోవద్దు. ఉదయాన్నే కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి.

మెల్లగా తినాలి

తిండి విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి. ఏది తిన్నా మెల్లగా నములుతూ తినాలి. అవసరమైనంతే తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించుకోవచ్చు. ఇతర పనులు చేస్తూ తినకూడదు. ఫోన్ చూస్తు అస్సలు ఏమీ తినొద్దు. ఒత్తిడి బరువు పెరిగేలా చేస్తుంది. దీంతో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ అవుతుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు నిద్ర కూడా ముఖ్యమైనదే. రాత్రి సరైన సమయానికి నిద్రపోవాలి. ఉదయం లేవాలి.

తదుపరి వ్యాసం