మీ పిల్లల పొట్ట ఆరోగ్యంగా ఉండాలా? రోజూ వీటిని తినిపించండి-want your childs stomach to be healthy feed them daily ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మీ పిల్లల పొట్ట ఆరోగ్యంగా ఉండాలా? రోజూ వీటిని తినిపించండి

మీ పిల్లల పొట్ట ఆరోగ్యంగా ఉండాలా? రోజూ వీటిని తినిపించండి

Feb 15, 2024, 01:15 PM IST Haritha Chappa
Feb 15, 2024, 01:15 PM , IST

  • పిల్లల పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే వారికి ప్రతి రోజూ కొన్ని రకాల ఆహారాలను తినిపించాలి. వారి పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది. పొట్ట ఆరోగ్యంగా ఉండేందుకు వారికి ఏం తినిపించాలో తెలుసుకోండి.

పిల్లలు ఏదైనా తినేందుకు మారాం చేస్తారు. ఏదీ తినేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రులుగా వారికి పౌష్టికమైన ఆహారాన్ని తినిపించాల్సిన బాధ్యత మీదే. వారిలో పొట్ట ఆరోగ్యంగా ఉండాలన్నా, పొట్టలోని బ్యాక్టిరియా బాగుండాలన్నా కొన్ని రకాల ఆహారాలు వారికి ప్రతిరోజూ తినిపించాలి. 

(1 / 10)

పిల్లలు ఏదైనా తినేందుకు మారాం చేస్తారు. ఏదీ తినేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రులుగా వారికి పౌష్టికమైన ఆహారాన్ని తినిపించాల్సిన బాధ్యత మీదే. వారిలో పొట్ట ఆరోగ్యంగా ఉండాలన్నా, పొట్టలోని బ్యాక్టిరియా బాగుండాలన్నా కొన్ని రకాల ఆహారాలు వారికి ప్రతిరోజూ తినిపించాలి. (Freepik)

పెరుగు: పెరుగన్నంతోనే భారతీయ భోజనం పూర్తవుతుంది. అలాగే పిల్లలకు కచ్చితంగా రోజూ పెట్టాల్సిన ఆహారం పెరుగు. దీనిలో లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

(2 / 10)

పెరుగు: పెరుగన్నంతోనే భారతీయ భోజనం పూర్తవుతుంది. అలాగే పిల్లలకు కచ్చితంగా రోజూ పెట్టాల్సిన ఆహారం పెరుగు. దీనిలో లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.(Pexels)

మజ్జిగ: మజ్జిగ అనేది సాంప్రదాయ భారతీయ పానీయం. దీనిని తరచూ పిల్లల చేత తాగిస్తూ ఉండాలి. దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి.

(3 / 10)

మజ్జిగ: మజ్జిగ అనేది సాంప్రదాయ భారతీయ పానీయం. దీనిని తరచూ పిల్లల చేత తాగిస్తూ ఉండాలి. దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి.(Unsplash)

ఇడ్లీ/దోశ: ఈ రెండింటినీ పులియబెట్టిన పిండితో చేస్తారు. కాబట్టి వీటిలో కూడా ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. 

(4 / 10)

ఇడ్లీ/దోశ: ఈ రెండింటినీ పులియబెట్టిన పిండితో చేస్తారు. కాబట్టి వీటిలో కూడా ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. (Pinterest)

పులియబెట్టిన ఊరగాయలు: తెలుగిళ్లల్లో నిల్వ పచ్చళ్లు సాధారణంగానే ఉంటాయి. వీటిని పెద్దలే కాదు, పిల్లల చేత కూడా తినిపిస్తూ ఉండాలి. వీటిలో కూడా ప్రొబయోటిక్స్ ఉంటాయి. 

(5 / 10)

పులియబెట్టిన ఊరగాయలు: తెలుగిళ్లల్లో నిల్వ పచ్చళ్లు సాధారణంగానే ఉంటాయి. వీటిని పెద్దలే కాదు, పిల్లల చేత కూడా తినిపిస్తూ ఉండాలి. వీటిలో కూడా ప్రొబయోటిక్స్ ఉంటాయి. 

వెల్లుల్లి: అనేక భారతీయ కూరలకు మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. వెల్లుల్లిలో పేగు ఆరోగ్యానికి దోహదపడే ప్రోబయోటిక్ సమ్మేళనాలు ఉంటాయి.

(6 / 10)

వెల్లుల్లి: అనేక భారతీయ కూరలకు మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. వెల్లుల్లిలో పేగు ఆరోగ్యానికి దోహదపడే ప్రోబయోటిక్ సమ్మేళనాలు ఉంటాయి.

అరటిపండు: అరటిపండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల  మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి.

(7 / 10)

అరటిపండు: అరటిపండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల  మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి.(Freepik)

ఉల్లిపాయలు: ఇవి లేకుండా ఏ కూర పూర్తికాదు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడే ప్రొబయోటిక్ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.

(8 / 10)

ఉల్లిపాయలు: ఇవి లేకుండా ఏ కూర పూర్తికాదు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడే ప్రొబయోటిక్ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.(Freepik)

తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, ఓట్స్, మినుములు, పెసలు వంటి ఆహారాలను పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి.

(9 / 10)

తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, ఓట్స్, మినుములు, పెసలు వంటి ఆహారాలను పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి.(Shutterstock)

చిక్కుళ్ళు : కాయధాన్యాలు, చిక్‌పీస్, ఇతర చిక్కుడు జాతి కూరలను పిల్లల చేత తినిపిస్తూ ఉండాలి. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. 

(10 / 10)

చిక్కుళ్ళు : కాయధాన్యాలు, చిక్‌పీస్, ఇతర చిక్కుడు జాతి కూరలను పిల్లల చేత తినిపిస్తూ ఉండాలి. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. (Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు