Insects In Rice Bag : బియ్యంలోకి పురుగులు రాకుండా ఉండేందుకు సింపుల్ చిట్కాలు-get rid of worms and insects in rice simple tips with neem and biryani leaves ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Insects In Rice Bag : బియ్యంలోకి పురుగులు రాకుండా ఉండేందుకు సింపుల్ చిట్కాలు

Insects In Rice Bag : బియ్యంలోకి పురుగులు రాకుండా ఉండేందుకు సింపుల్ చిట్కాలు

Anand Sai HT Telugu
Feb 12, 2024 12:30 PM IST

Get Rid Of Insects In Rice : బియ్యంలో పురుగులు రావడం అనేది దాదాపు ప్రతీ ఇంట్లో ఉండే సమస్య. దీని నుంచి బయటపడేందుకు సింపుల్ చిట్కాలు ఉన్నాయి.

బియ్యంలో పురుగులు రాకుండా ఏం చేయాలి
బియ్యంలో పురుగులు రాకుండా ఏం చేయాలి (Unsplash)

పల్లెటూరైనా, సిటీ అయినా చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య బియ్యంలో పురుగులు రావడం. ఒకేసారి క్వింటాళ్ల కొద్ది రైస్ కొని ఇంట్లో పెట్టుకుంటారు. మెుదట కొన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత అసలు సమస్య మెుదలవుతుంది. కీటకాలు, పురుగులు అందులో వచ్చి చేరుతాయి. ముఖ్యంగా నల్లగా, చిన్నగా ఉండే లక్క పురుగు అనేది బియ్యంలోకి ప్రవేశిస్తుంది. క్రమంగా సంతానాన్ని పెంచుకుంటుంది. బియ్యంలోపల, బయట ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇది చూసేందుకు చిరాకుగా ఉంటుంది.

yearly horoscope entry point

రైస్ తీసి అన్నం వండేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా ఒకటో.. రెండో అందులోనే ఉంటాయి. దీంతో బియ్యం కడిగి అన్నం పెట్టిన తర్వాత పైన తేలుతూ ఉంటాయి. ఇలా పురుగులతో ఇబ్బందులు పడే బదులు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మీకు ఇబ్బందులు రావు.

చాలా సార్లు మనం నిల్వ ఉంచే బియ్యంలో ఇలానే పురుగులు, కీటకాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఈ ఉపాయాలతో బియ్యంలోకి ఏమీ రాకుండా చూసుకోవచ్చు.

ఓ వైపు బియ్యం ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. బియ్యంతో పాటు పప్పులు తదితర ధాన్యాల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో చాలా మంది ప్రజలు పెద్దఎత్తున బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలను ఇళ్లలో నిల్వ చేసుకోవడం సహజం. సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు.

కానీ ఇలా పెద్దమొత్తంలో నిల్వ ఉంచినప్పుడు వాటిలో పురుగులు, కీటకాలు రావడం మొదలవుతాయి. దీంతో తినాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బియ్యం వంటి ఇతర ధాన్యాలను ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయాలో తెలుసుకోండి. ఈ విధంగా అవి సంవత్సరాలుగా ఉన్నా చెడిపోవు. వాటిని ఏడాది పొడవునా వాడుకోవచ్చు. బియ్యంలోకి పురుగులు రాకుండా ఉండేందుకు కింద చెప్పే చిట్కాలు పాటించండి.

బిర్యానీ ఆకును సాధారణంగా బిర్యానీ, ఇతర మసాలా వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వీటి వాసన మనకు చాలా ఇష్టం. కానీ కీటకాలు ఇష్టపడవు. మీకు పప్పులు, బియ్యం ఎక్కువగా ఉంటే ఈ ఆకులను అందులో వేయండి. వాటి వాసన కీటకాలను నిరోధిస్తుంది. బియ్యం సంచిలో బిర్యానీ ఆకును నాలుగైదు ముక్కలుగా చేసి కలపండి. వీటి వాసనకు పురుగులు రావు.

ఎర్ర మిరపకాయలను రోజువారీ వంటలలో ఉపయోగించే ప్రధాన పదార్థాలలో ఒకటి. వీటిలో ఉండే ఆల్కలీనిటీ మనకు దాహాన్ని కలిగిస్తుంది. మీరు నిల్వ చేసిన ధాన్యంలో దీన్ని ఉంచండి.. కీటకాలు రావు. దీని వాసనకు కీటకాలు పారిపోతాయి. బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటుంది. చాలా రోజులు పురుగులు రాకుండా ఉంటాయి.

వేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పురుగులను నివారించడానికి మీరు నిల్వ చేసిన బియ్యంలో ఈ ఆకును జోడించాలి. దీనివల్ల బియ్యం నెలల తరబడి పాడవవు. కీటకాలను తట్టుకోలేవు. చాలా మంది రైతులు ఈ చిట్కాను పాటిస్తారు. బియ్యం పట్టించిన తర్వాత అందులో వేప ఆకులను వేస్తారు. వాటిని సంచిలో వేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి.

Whats_app_banner