తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  How Much Protein : ఆరోగ్యకరమైన వ్యక్తి రోజూ ఎంత మెుత్తంలో ప్రోటీన్ తీసుకోవాలి?

How Much Protein : ఆరోగ్యకరమైన వ్యక్తి రోజూ ఎంత మెుత్తంలో ప్రోటీన్ తీసుకోవాలి?

Anand Sai HT Telugu

23 January 2024, 13:00 IST

    • How Much Protein Per Day : శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే రోజు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారాల్లో ప్రోటీన్ దొరుకుతుందో కూడా తెలుసుకోవాలి.
ప్రోటీన్ ఆహారాలు
ప్రోటీన్ ఆహారాలు (Unsplash)

ప్రోటీన్ ఆహారాలు

మంచి కండరాల పెరుగుదలకు ప్రోటీన్ తినాలని మనం తరచుగా వింటుంటాం. కానీ నిజానికి ప్రతి వ్యక్తికి ప్రొటీన్‌ చాలా అవసరం. వ్యాయామం చేసినా చేయకపోయినా మంచి ఆరోగ్యానికి రోజూ ప్రొటీన్స్ కావాలి. ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎంత ప్రోటీన్ అవసరం అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ప్రోటీన్లు మీ శరీరం ప్రధాన నిర్మాణ వస్తువులుగా చెప్పవచ్చు. ఇది అమైనో ఆమ్లాలతో రూపొందించబడిన నిర్మాణంగా అంటారు. వీటిలో కొన్ని మన శరీరం ఉత్పత్తి చేస్తే.. పూర్తిగా పొందాలంటే కొన్ని ఆహారపదార్థాలను ఆశ్రయించాల్సిందే. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటివి తినాలని సిఫార్సు చేస్తారు. ఇది తగినంత ప్రోటీన్‌ను అందించగలదు.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

ప్రోటీన్ తీసుకోవడం మీ జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వు లేదా కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్ తీసుకోవడం మంచిది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం కండరాలు, బలాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో కణజాల పెరుగుదలకు శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. గర్భధారణ సమయంలో ఒక కిలోకు 1.2-1.52 గ్రాముల ప్రోటీన్ రోజువారీ తీసుకోవడం సిఫార్సు చేస్తారు. పాలిచ్చే సమయంలో కూడా తల్లికి ప్రొటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం.

మీ ఉద్యోగం నడక, పరుగు, స్విమ్మింగ్, మరేదైనా వ్యాయామం వంటి శారీరక శ్రమతో కూడుకున్నది అయితే మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. అథ్లెట్లకు అధిక మొత్తంలో ప్రోటీన్ అవసరం. రోజుకు కిలోకు 1.2-1.4 గ్రాముల ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ తీసుకోవడం రక్తపోటును తగ్గిస్తుంది. మధుమేహంతో పోరాడటానికి సహాయపడుతుంది. మెుత్తం శరీరానికి ప్రోటీన్ కచ్చితంగా కావాలి.

మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉండి, వ్యాయామం చేయనట్లయితే కిలోకు 0.8-1.3 గ్రాముల ప్రోటీన్ మంచి ఎంపిక. ఆరోగ్యకరమైన మగవారికి రోజుకు 56-91 గ్రాములు, ఆరోగ్యకరమైన స్త్రీకి రోజుకు 46-75 గ్రాముల ప్రోటీన్ కావాలి.

ప్రోటీన్ ఎక్కువగా దొరికేది మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు. అవి మీ శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. చిక్కుళ్ళు, గింజలు కూడా ప్రోటీన్లలో అధికంగా ఉంటాయి. గుడ్డు అనేది అధిక ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థం. దీనితో పాటు విటమిన్లు, ఖనిజాలు, కంటికి మేలు చేసే యాంటీ-ఆక్సిడెంట్లు, శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మన ఆహారంలో ప్రతిరోజూ ఒక గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి.

గుడ్లు తినడానికి ఇష్టపడని వారు పప్పులు తీసుకోవచ్చు. ఇందులో ప్రొటీన్లు మాత్రమే కాకుండా ఖనిజాలు, ఫైబర్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి వంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వండిన బంగాళదుంపలు మీ శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. బంగాళదుంపలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. వాటిని మితంగా తీసుకోవాలి.

పాలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ పొందడానికి పాలు తాగడం అలవాటు చేసుకోండి. చికెన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ప్రోటీన్ ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మెుత్తం ఆరోగ్యం బాగుంటుంది.

తదుపరి వ్యాసం