తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poha Dosa: అటుకులతో కమ్మటి, పుల్లటి దోశ

poha dosa: అటుకులతో కమ్మటి, పుల్లటి దోశ

HT Telugu Desk HT Telugu

04 May 2023, 6:30 IST

  • poha dosa: అటుకులతో దోసె సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 

poha dosa Recipe
poha dosa Recipe (Slurrp)

poha dosa Recipe

అటుకులతో ఆలూపోహానో, వెజిటేబుల్ పోహానో తినీ తినీ విసుగొస్తోందా. అయితే అటుకులు, బియ్యం కలిపి చేసే అటుకుల దోసె చేసుకుని చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కావాల్సిన పదార్థాలు:

బియ్యం - 1 కప్పు

అటుకులు - సగం కప్పు

మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు

పెరుగు - సగం కప్పు

బేకింగ్ సోడా - పావు టీస్పూన్

ఉప్పు - తగినంత

నూనె - తగినంత

తయారీ విధానం:

step 1: ఒక పెద్ద గిన్నెలో పెరుగు తీసుకుని దాంట్లో సగం కప్పు నీళ్లు పోసుకుని మజ్జిగ లాగా చేసుకోండి. మజ్జిగ ఉంటే అదే వాడండి.

step 2: మరో పాత్రలో బియ్యం, మినప్పప్పు, అటుకులు వేసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు నీళ్లన్నీ వంపేయండి.

step 3: ఇందులో మజ్జిగ కలుపుకోండి. మెల్లగా మజ్జిగలో బియ్యం, అటుకులు, మినప్పప్పు కలిసేలా చూసుకోండి. అలా కనీసం 4 గంటలు నాననివ్వండి.

step 4: తరువాత మజ్జిగను కాస్త వంపేసి మిగతాదంతా మిక్సీలో పట్టుకోండి. ఇప్పుడు మజ్జిగతో పాటూ సోడా, ఉప్పు కలుపుకోండి, నాలుగైదు గంటలు పులియబెట్టిన తరువాత కాస్త మందంగా దోసెల్లాగా వేసుకుంటే చాలు.

తదుపరి వ్యాసం