తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Summer Foods । మండే వేసవిలో మీ ఆరోగ్యం చల్లగా ఉండాలంటే తినాల్సినవి ఇవీ!

Healthy Summer Foods । మండే వేసవిలో మీ ఆరోగ్యం చల్లగా ఉండాలంటే తినాల్సినవి ఇవీ!

HT Telugu Desk HT Telugu

20 May 2023, 8:37 IST

    • Healthy Summer Foods: మండు వేసవిలో మీ ఆరోగ్యం విషయంలో అత్యంత కీలకమైన విషయం  మీరు తీసుకునే ఆహారమే. మిమ్మల్ని మీరు రిఫ్రెష్‌గా ఉంచుకోవడానికి, మంచి ప్రేగు ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Healthy Summer Foods:
Healthy Summer Foods: (Unsplash)

Healthy Summer Foods:

Healthy Summer Foods : మండు వేసవిలో మీ ఆరోగ్యం విషయంలో అత్యంత కీలకమైన విషయం ఏంటో తెలుసా? అది మీరు తీసుకునే ఆహారమే. మీ జీర్ణవ్యస్థకు మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ వేసవి కాలం మీ ప్రేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనేక అంశాలను కలిగి ఉంది. వేడిని తాళలేక చాలా మంది చల్లని పదార్థాలు తీసుకుంటారు, చక్కెర పానీయాలు, చల్లటి బీర్లు వంటి వాటికోసం ఆరాటపడతారు. ఇవి తీసుకునేటపుడు బాగానే అనిపిస్తుంది కానీ, కడుపులోకి వెళ్లిన తర్వాత ఇబ్బందిని కలిగిస్తాయి. మీరు తీసుకునే ఆహార పానీయాలలోని కృత్రిమ పదార్ధాలు, సంతృప్త కొవ్వులు మీ ప్రేగు ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

కాబట్టి, మీరు ఆకలిదప్పికల కోరికలకు లొంగిపోకుండా వేసవికి అనుకూలమైన ఆహారంను తీసుకోవాలి. మీ ఆహారంలో సరైన ప్రోబయోటిక్స్, మజ్జిగ , సత్తు వంటివి కొంచెం అదనంగా తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇవి ఈ వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచడంతో పాటు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

వేసవిలో తీవ్రమైన ఎండలు, వేడి పరిస్థితులు, తేమ వాతావరణం కారణంగా మీ శరీరం ఎక్కువగా నీటిని, శక్తిని కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని మీరు రిఫ్రెష్‌గా ఉంచుకోవడానికి, మంచి ప్రేగు ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

పెరుగు అన్నం

ఈ వేసవిలో తరచుగా పెరుగు అన్నం తినడం అలవాటు చేసుకోండి. వేసవి వేడిని తట్టుకుని నిలబడాలన్నా, మీ కడుపుని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా పెరుగు అన్నం చాలా మంచి ఆహారం. ప్రోబయోటిక్స్‌తో నిండిన ఈ ఆహారం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం కాబట్టి, పెరుగన్నం మీ ఎముకలు , కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, మీకు మంచి శక్తిని అందిస్తుంది. ఈ వేసవిలో మధ్యాహ్నం పూట ఒక గిన్నె పెరుగు అన్నం తినండి, మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.

తృణధాన్యాలు

వేసవి కాలంలో మీరు వేడిని అధిగమించగల ఆహారాన్ని తినవలసి ఉంటుంది. తృణధాన్యాలు మీకు చాలా అవసరమైన పోషణను అందిస్తాయి, మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. సాధారణ దాల్ రైస్ తింటూ ఉండండి, సాంప్రదాయ ధాన్యాలు కాకుండా బార్లీ, రాగి వంటివి తీసుకోండి. తృణధాన్యాలు మంటను తగ్గించడమే కాకుండా మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి.

మజ్జిగ

ఈ వేసవిలో మీ పేగును చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఒక గ్లాసు మజ్జిగ తాగండి. పెరుగును నీటితో చిలికి మజ్జిగ తయారుచేస్తారు. మజ్జిగ అనేది ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పానీయం. జీర్ణక్రియ మెరుగుపరచడంలో, ఉబ్బరం, మలబద్ధకం నివారించడంలో సహాయపడుతుంది. మజ్జిగలో కేలరీలు తక్కువ ఉంటాయి, అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఎక్కువ కలిగి ఉంటుంది.

ఓట్స్

ఓట్స్‌లో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఓట్ మీల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఇది ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను పునరుద్ధరిస్తుంది, మీరు చాలా కాలం పాటు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి అనవసరపు ఆహార కోరికలకు మీరు టెంప్ట్ కాలేరు.

అరటిపండ్లు

వేడి, మంటతో పోరాడటంలో అరటిపండ్లు తమ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తాయి. ఈ పండు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, ఇది అతిసారం, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. నీరసంగా మారిన మీ శరీరాలకు తక్షణమే శక్తిని కూడా అందిస్తాయి. వేసవిలో తాజా అరటిపండ్లు తింటూ ఉండండి.

తదుపరి వ్యాసం