తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Independence Day 2022 । అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

Happy Independence Day 2022 । అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

HT Telugu Desk HT Telugu

15 August 2022, 7:04 IST

    • Happy Independence Day 2022: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి, త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన రోజు.. మాతృభూమికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చిన మధురమైన రోజు..  ఈ అమృత మహోత్సవాల సందర్భంగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి..
Happy Independence Day 2022
Happy Independence Day 2022

Happy Independence Day 2022

Happy Independence Day 2022: మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్ట్ 15, 2022 సోమవారం నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ శుభ సందర్భంగా దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. పరాయి పాలన నుంచి విముక్తి పొంది, స్వంత పాలనలో స్వతంత్ర భారతావనిలో తల ఎత్తుకొని స్వేచ్ఛగా జీవించటం మనందరికీ గర్వకారణం. ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యతను, మన దేశ చరిత్రను చాటిచెప్పటం, మన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవడం భారతీయులుగా మన బాధ్యత.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

ఉత్సాహంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామి అవుదాం. జనగణమన అంటూ మది పరవశించేలా జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. గర్వంగా రెపరెపలాడే మన జాతీయ జెండాకు సెల్యూట్ చేద్దాం.

మీరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ దేశభక్తిని పెంపొందించే కొన్ని సందేశాలు, సూక్తులు, చిత్రాలు ఉన్నాయి. వీటిని మీ తోటి భారతీయులకు పంపి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి.

<p>Happy Independence Day 2022</p>

ఎందరో త్యాగధనుల పుణ్యఫలం స్వాతంత్య్రం.. మన స్వాతంత్య్ర సమరయోధులకు సెల్యూట్ చేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయుడవని గర్వించు.. భారతీయుడిగా జీవించు.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

<p>Happy Independence Day 2022</p>

ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. దేశ శాంతి, సామరస్యాలను కాపాడుతానని.. జాతి ఔన్నత్యానికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేద్దాం..

<p>Happy Independence Day 2022</p>

వ్యక్తులను చంపేయగలం, కానీ వారి ఆశయాలను చంపలేం.. ఇంక్విలాబ్ జిందాబాద్.

<p>Happy Independence Day 2022</p>

తపులు చేసేందుకు స్వేచ్ఛను ఉపయోగించుకుంటే.. స్వేచ్ఛా స్వ్యాతంత్య్రాలకు విలువ ఉండదు..

భారతీయులందరికీ హిందూస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

తదుపరి వ్యాసం