తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Crab Masala Curry Recipe | కమ్మని పీతల మసాలా.. తినండి నోర్లు ఊరేలా!

Crab Masala Curry Recipe | కమ్మని పీతల మసాలా.. తినండి నోర్లు ఊరేలా!

HT Telugu Desk HT Telugu

12 February 2023, 13:10 IST

    • Crab Masala Curry Recipe: ప్రతీసారి చికెన్, మటన్ తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి పీతల కూర తిని చూడండి. సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Crab Masala Curry Recipe
Crab Masala Curry Recipe (Slurrp)

Crab Masala Curry Recipe

విందులో ఎన్ని రకాల వంటకాలు ఉన్నా.. మాంసాహరం ఉంటేనే అది అసలైన విందు భోజనం అనిపించుకుంటుంది. ఈరోజు ఆదివారం.. విందులు, వినోదాలతో ఆనందగా గడిపే రోజు. ఈరోజు ఇంట్లో నాన్-వెజ్ వంటకం లేకపోతే అది అసలు ఆదివారం లాగే అనిపించదు. చాలా మంది ఇళ్లల్లో మధ్యాహ్నం అవుతుందంటే చికెన్, మటన్ మసాలాల ఘుమఘుమలు వ్యాపిస్తాయి. మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్? ఎప్పుడూ మాంసం కూర తిని బోర్ కొట్టిందా? సీఫుడ్ చేసుకోవాలనుకుంటున్నా ఎలా చేయాలో తెలియడం లేదా? అయితే మీకొక సింపుల్ రెసిపీని ఇక్కడ పరిచయం చేస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

చాలా మందికి పీతలు లేదా ఎండ్రికాయలు తినాలని చాలా ఇష్టం ఉంటుంది, కానీ దానిని ఎలా చేయాలో తెలియదు. మీకోసం ఇక్కడ భారతీయ పద్ధతిలో, మసాలాలు బాగా దట్టించిన పీతల మసాలా కూర రెసిపీని అందిస్తున్నాం. దీని రుచి చూస్తే తల గిర్రున తిరుగుతుంది, అంత కమ్మగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మీరు ఈ కూర చేయడానికి నీలి సముద్రపు పీతలు లేదా మృదువైన షెల్ పీతలు, మట్టి పీతలు లేదా పెద్ద నారింజ పీతలు వంటి తినదగిన ఎలాంటి పీతలనైనా ఉపయోగించవచ్చు.

ఈ కింద పీతల మసాలా కర్రీ రెసిపీ ఉంది, సూచనలు అనుసరించండి, నోరూరించే పీతల కూరను వండుకొని, విందు చేసుకోండి.

Crab Masala Curry Recipe కోసం కావలసినవి

  • 3 పెద్దవి లేదా 10 చిన్న పీతలు
  • 2 ఉల్లిపాయలు
  • 3 టొమాటోలు
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 2 స్పూన్ల కారం
  • 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  • 2 స్పూన్ల గరం మసాలా పౌడర్
  • రుచికి సరిపడా ఉప్పు
  • 3 టేబుల్ స్పూన్లు నూనె

మసాలా కోసం

  • 1/2 కప్పు తురిమిన తాజా కొబ్బరి
  • 1 టేబుల్ స్పూన్ గసగసాలు
  • 1 టీస్పూన్ మిరియాలు
  • 1 టీస్పూన్ ఫెన్నెల్ సీడ్స్ / సోంపు

పీతల మసాలా కూర తయారీ విధానం

  1. ముందుగా పీతలను బాగా కడిగి శుభ్రం చేయండి. ప్రతి పీతను 4 ముక్కలుగా కట్ చేసుకోండి. పీత కాళ్లను 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఆపై కట్ చేసిన పీత ముక్కలను మళ్లీ ఒక సారి నీటితో శుభ్రం చేయండి
  2. అనంతరం పసుపు, కారం, ఉప్పుల మిశ్రమంతో పీత ముక్కలను మెరినేట్ చేయండి, కొన్ని నిమిషాలు పక్కన పెట్టండి.
  3. ఇప్పుడు ఉల్లిపాయలు, టొమాటోలు, మిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని, వీటిని బ్లెండర్‌లో వేసి మెత్తని ప్యూరీలా చేసుకొని పక్కనపెట్టండి.
  4. ఇప్పుడు 'మసాలా కోసం' పైన పేర్కొన్న తాజా కొబ్బరి, మిగతా మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్తని ప్యూరీగా చేసుకోండి. పక్కన పెట్టండి.
  5. ఇక, కడాయిలో నూనె వేడి చేయండి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.
  6. ఆ వెంటనే ఇదివరకు సిద్ధం చేసుకున్న టొమాటో- ఆనియన్ ప్యూరీ వేసి బాగా కలపండి. నూనె విడిపోయే వరకు వేయించాలి.
  7. ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు, మసాలా పొడులన్నీ వేసి బాగా కలపాలి.
  8. అనంతరం మెరినేట్ చేసిన పీతలు వేసి బాగా కలపాలి.
  9. ఇందులో మసాలా కొబ్బరి ప్యూరీ వేసి కలపండి, గ్రేవీ కోసం అవసరమైతే 1/2 కప్పు నీరు కలపండి.
  10. మూతపెట్టి 20 నిమిషాలు ఉడికించండి, చివరగా కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయండి.

అంతే, రుచికరమైన పీతల మసాలా కూర రెడీ. ఈ కూరను స్టీమ్డ్ రైస్ లేదా చపాతీలతో తింటే అదిరిపోతుంది.

తదుపరి వ్యాసం