తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  28 Days Challenge : 28 రోజులు మందు కొట్టడం ఆపేస్తే ఊహించని ప్రయోజనాలు

28 Days Challenge : 28 రోజులు మందు కొట్టడం ఆపేస్తే ఊహించని ప్రయోజనాలు

Anand Sai HT Telugu

06 February 2024, 14:00 IST

    • 28 Days Alcohol Challenge : మద్యం తాగితే వచ్చే సమస్యలు మన అందరికీ తెలుసు. కానీ అంత ఈజీగా మనేయరు. 28 రోజుల పాటు మద్యం మానేస్తే చాలా ప్రయోజనాలు పొందుతారు.
మద్యం తాగడం ఆపేస్తే ప్రయోజనాలు
మద్యం తాగడం ఆపేస్తే ప్రయోజనాలు (Pexels)

మద్యం తాగడం ఆపేస్తే ప్రయోజనాలు

మనకు ఉండే అలవాట్లతోనే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మన అలవాట్లను వల్ల శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి. కొన్ని మార్పులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని మార్పులు చాలా ప్రతికూల పరిణామాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు మద్యపానం, ధూమపానం ఆపేయడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇలాంటి అలవాటును కొద్దిరోజులు మానుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ప్రధానంగా ఆల్కహాల్ అలవాటును మానుకుంటే మరీ మంచిది. వరుసగా 28 రోజులు మద్యం సేవించకపోతే శరీరంలో వచ్చే మార్పుల గురించి చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

మద్యం అలవాటు ఉన్న వారిలో సగటు వ్యక్తి సంవత్సరానికి 9.5 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొందరు అప్పుడప్పుడు తాగేవారు ఉన్నారు. 28 రోజుల పాటు మద్యాన్ని మనేయకపోతే శరీరంపై అనేక ప్రభావాలు ఏర్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

28 రోజుల ఛాలెంజ్

28 రోజులు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుంది. మీరు ఆల్కహాల్ కంటే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మీకు రుచికరమైనది తినాలనే కోరిక ఉంటుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు.

నిద్రలేమి సమస్యలకు చెక్

మందు కొట్టి నిద్రపోతే చెత్త పీడకలలు వస్తాయి. కానీ మందు కొట్టకపోతే అలాంటి కలలు రావు. కలలు చాలా ఆహ్లాదకరంగా మారతాయి. అయితే నిత్యం మందు తాగేవారికి 28 రోజుల పాటు దీన్ని నివారించడం కాస్త కష్టమే. ఇది చాలా మందిలో నిద్రలేమిని కూడా కలిగిస్తుంది. అయితే మద్యం ఎక్కువగా తాగినా నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. మద్యం ఎక్కువైతే పడుకున్నాక రాత్రిపూట దాహం ఎక్కువగా వేస్తుంది. చాలాసార్లు అర్ధరాత్రి లేవాల్సి వస్తుంది.

మందు 28 రోజులపాటు మానేస్తే.. మొదటి వారంలో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాలేయం కొద్దికొద్దిగా శుభ్రపరచడం ప్రారంభమవుతుంది. జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.

జీర్ణసమస్యలు క్లియర్ అవుతాయి

మద్యపానం మానేసిన తర్వాత, జీర్ణవ్యవస్థ మునుపటి కంటే మరింత సాఫీగా పనిచేయడం ప్రారంభిస్తుంది. కడుపులో ఆమ్లం మొత్తం సమతుల్యంగా ఉంటుంది. మందు తాగడం మానేసిన 2 వారాల తర్వాత ఈ మార్పు వస్తుంది.

మీరు ఆల్కహాల్ తాగడం మానేసిన తర్వాత, మీ శరీరం సాధారణ స్థితికి రావడం మెుదలవుతుంది. ఆ విధంగా ఇది మీకు మంచి నిద్రను ఇస్తుంది. మీరు ఉదయాన్నే నిద్ర లేచేలా చేస్తుంది. అవయవాలు సజావుగా పని చేస్తాయి.

దంతాలు మునుపటి కంటే బలంగా తయారవుతాయి. మద్యపానం మానేయడం వల్ల దంతక్షయం నివారించవచ్చు. అలాగే దంతాలను దృఢంగా మార్చడంతోపాటు పళ్లను తెల్లగా మార్చుతుంది. వాసన తగ్గడం ప్రారంభమవుతుంది.

ముఖంలో మార్పులు

మద్యపానం 28 రోజులు ఆపేస్తే.. మీ ముఖంలో చాలా మార్పులు మొదలవుతాయి. గతంలో ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండదు. కానీ తాగడం ఆపిన మొదటి వారం తర్వాత సాధారణ రక్తస్రావం ఉంటుంది. ఇది ముఖం ముడతలు, నల్ల మచ్చలు మొదలైన వాటిని కూడా నివారిస్తుంది.

తొలిదశలో కొంచెం కష్టమైనా 28 రోజుల పాటు ఇలా పాటిస్తే ఆరోగ్యం గతంలో కంటే చాలా రెట్లు మారిపోవడం ఖాయం. రక్త ప్రసరణకు ఆటంకం కలగకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. మద్యం ఆపేస్తే ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే మెుదలుపెట్టండి.

తదుపరి వ్యాసం