Thirsty At Night : అర్ధరాత్రి దాహంగా ఉంటుందా? ఇవే కారణాలు కావొచ్చు
Thirsty At Night Reasons : రాత్రి పడుకునే ముందు సరిపడా నీళ్లు తాగుతున్నా.. చాలా మంది అర్ధరాత్రి గొంతు పొడిబారడం అనే సమస్యతో బాధపడుతుంటారు. నీళ్లు తాగడానికి పదే పదే నిద్రలేస్తారు. దీంతో నిద్ర సరిగా పట్టదు. నిద్ర లేకపోవడం వల్ల వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి.

పడుకునేముందు పొట్ట నిండా నీళ్లు తాగినా.. కొందరికి అర్ధరాత్రి మెలకువ వస్తుంది. నీరు తాగాలి అనిపిస్తుంది. తాగి పడుకున్నాక.. మరోసారి కూడా ఇలాగే అవుతుంది. వైద్యులు ప్రకారం నిద్రలో దాహం వేయడం వివిధ వ్యాధుల ప్రారంభ లక్షణం కావచ్చు. ఇది ప్రతిరోజూ సంభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఇలా ఎందుకు జరుగుతుందో చూడండి..
ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా నూనె, మసాలాలు తింటారు. కానీ చాలా మంది వంటలో నూనె, మసాలాలు ఎక్కువగా ఉంటే తప్ప తినరు. ఆ సమయానికి రుచి కోసం మాత్రమే చూసుకుంటారు. కానీ తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ అదనపు నూనె, మసాలా ఆహారాన్ని తినడం వల్ల గొంతు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో రాత్రి దాహం వేస్తుంది. నూనె, మసాలా ఎక్కువ తీసుకుంటే ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
చాలా మంది నిద్రపోయేటప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు లేదా ముక్కు మూసుకుపోయినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకునే అలవాటు ఉంటుంది. ఉబ్బసం ఉన్నవారు తరచుగా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఫలితంగా, నోటి లోపలి భాగం సులభంగా పొడిగా మారుతుంది. దీంతో అర్ధరాత్రి పడుకున్నాక కూడా దాహం వేస్తుంది.
రాత్రి నిద్రలో గొంతు పొడిబారడానికి కారణాలలో ఒకటి డీహైడ్రేషన్ లేదా అజీర్ణం. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు గొంతు పొడిబారుతుంది. డీహైడ్రేషన్ తీవ్రంగా ఉంటే.. ఇది మరణానికి దారి తీస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నా గొంతు పొడిగా ఉంటుంది.
జిరోస్టోమియా అనే వ్యాధితో నోటిలో లాలాజలం తగ్గుతుంది. ఇది ఈ రకమైన సమస్యకు కారణం కావచ్చు. ఇది సెప్సిస్ వంటి తీవ్రమైన వ్యాధుల లక్షణం కూడా. అందుకే అర్ధరాత్రి దాహం వేస్తుంది.
మధుమేహం వచ్చినా గొంతు ఎండిపోతుంది. మధుమేహం లక్షణాలలో ఇది కూడా ఒకటి. అధిక మూత్రం కారణంగా, శరీరం నీటిని సమతుల్యం చేయదు. ఫలితంగా గొంతు పొడిబారుతుంది.
ధూమపానం, మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి కూడా ఈ సమస్య రావచ్చు. రోజూ స్మోక్, ఆల్కహాల్ తాగేవారిలో 39 శాతం మంది లాలాజల ఉత్పత్తిని తగ్గించారని ఒక అధ్యయనంలో తేలింది. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. నీటి అవసరాన్ని సృష్టిస్తుంది.
అధిక రక్త పోటు ఉన్నవారు, అధిక చెమట కారణంగా, శరీరంలో నీటి స్థాయి సరిగ్గా ఉండదు. దీని వల్ల గొంతు పొడిబారుతుంది. అలాగే, కాలేయం, గుండె, మూత్రపిండాలు పనితీరు కోల్పోవడం మొదలవుతుంది. ఈ సమస్య కారణంగా అర్ధరాత్రి దాహం వేస్తుంది.