తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Low-budget Foreign Trip। క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ దేశాలకు వెళ్ళండి, ఖర్చు చాలా తక్కువ!

Low-budget Foreign Trip। క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ దేశాలకు వెళ్ళండి, ఖర్చు చాలా తక్కువ!

HT Telugu Desk HT Telugu

20 December 2022, 16:33 IST

    • Low-budget Foreign Trip: తక్కువ బడ్జెట్‌లో విదేశీ యాత్ర చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాల జాబితా ఉంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ఇవి ప్రత్యేకం.
Low-budget Foreign Trip
Low-budget Foreign Trip (HT Photo)

Low-budget Foreign Trip

Christmas 2022: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈ రెండు ఈవెంట్లను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి మీరు కూడా ఈసారి వేడుకలను భారతదేశం వెలుపల జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే బుకింగ్స్ చేసుకోండి. మీ జేబుకు చిల్లు పడకుండా తక్కువ బడ్జెట్లో కూడా గొప్పగా వేడుకలు జరుపుకునేందుకు అద్భుతమైన దేశాలు ఉన్నాయి. ఇవి భారతదేశానికి దగ్గరగా ఉంటాయి, ధరలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడకు వెళ్లిరావడానికి ప్రయాణ ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. మీరు ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా లేదా బృందంగా వెళ్లినా మీ పర్యటన ఆహ్లాదకరమైన, ఒత్తిడి లేని అనుభవాన్ని అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Low-budget Foreign Trip - తక్కువ బడ్జెట్‌లో విదేశీ యాత్ర

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి భారతదేశం నుండి సందర్శించడానికి తక్కువ బడ్జెట్ దేశాల జాబితాను ఇక్కడ తెలుసుకోండి, ఇక విమానం ఎక్కి మీకు నచ్చిన చోటుకు ఎగిరిపోండి.

బాలి

ఉష్ణమండల స్వర్గధామంగా చెప్పే బాలి నగరం ఇండోనేషియా దేశంలో ఉంది. ఈ చోటు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పర్యాటక కేంద్రాలలో ఒకటి. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను వేడుక చేసుకోవడానికి భారతీయులకు ఇది సరైన తక్కువ-బడ్జెట్ గమ్యస్థానం. మీరు మీ కుటుంబంతో కలిసి ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ వాటర్‌బామ్‌ని సందర్శించడం మరిచిపోవద్దు. పైథాన్ నుండి బూమరాంగ్ వరకు ఉన్న అనేక వాటర్ స్లైడ్‌లపై మీ పిల్లలతో కలిసి ఆటలు ఆడుకోవచ్చు. అలసిపోయినప్పుడు, పూల్ బార్ వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు లేదా రిఫ్లెక్సాలజీ మసాజ్ పొందవచ్చు.

బ్యాంకాక్

ఎల్లప్పుడూ వేలాది మంది విదేశీ పర్యాటకులతో కలకలలాడే నగరం బ్యాంకాక్. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా నగరంలోని అనేకమైన షాపింగ్ మాల్స్, హోటెళ్లు, రోడ్లు అన్నీ ఉల్లాసంగా, సందడిగా, లైట్ల ధగధగలతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్ పుడ్ రుచులను ఆస్వాదించడం, టుక్-టుక్‌లలో సఫారీ చేయడం మీకు గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో భారతీయులకు ఉత్తమ విదేశీ గమ్యస్థానం ఇదే.

జోర్డాన్

జోర్డాన్ ఇస్లామిక్ దేశమే అయినప్పటికీ ఇక్కడ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా జోరుగా జరుగుతాయి. ప్రపంచంలోని స్నేహపూర్వక పర్యాటక ప్రదేశాలలో జోర్డాన్ ఒకటి. ఈ దేశం అనేక మానవ నిర్మిత స్మారక చిహ్నాలు, అబ్బురపరిచే కట్టడాలు, అద్భుతమైన సహజ సంపదతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. జోర్డాన్‌లో అనేక ప్రసిద్ధ పర్యాటక మహానగరాలు ఉన్నాయి జోర్డాన్‌లో క్రిస్మస్‌ను జరుపుకోవడం జీవితంలో ఒక్కసారైనా చేసే సాహసం, చౌకైన సెలవు ప్రదేశం.

లావోస్

కొండ ప్రాంతాలు, బౌద్ధ విహారాలు, అద్భుతమైన ఫ్రెంచ్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన ఆగ్నేయాసియా దేశం లావోస్. మీరు భారతదేశం నుండి చౌకైన దేశానికి వెళ్లాలనుకుంటే లావోస్ ఒక అద్భుతమైన గమ్యస్థానంగా ఉంటుంది. లావోస్‌లో క్రిస్మస్‌ను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండుగను వాణిజ్యీకరించిన చాలా దేశాల మాదిరిగా కాకుండా, నిజమైన పండగ సారాంశం ఇప్పటికీ లావోస్‌లో భద్రంగా దాచి ఉంచబడింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను ప్రత్యేకాంగా జరుపుకోవాలంటే మీరు మీ ట్రావెల్ లిస్టులో లావోస్ దేశాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఫిలిప్పీన్స్

అద్భుతమైన బీచ్‌లు, చెడిపోని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ఫిలిప్పీన్స్ దీవులు భారతదేశానికి చేరువలో, అత్యంత సరసమైన గమ్యస్థానాలలో ఒకటి. మీరు మీ కుటుంబం, స్నేహితులు లేదా ప్రియమైనవారితో కలిసి ఫిలిప్పీన్స్‌లో క్రిస్మస్ సెలవులకు వెళ్లాలనుకుంటే, ఇక్కడ క్రిస్మస్ ఆచారాలను హైలైట్ చేసే అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ క్రిస్మస్ గమ్యస్థానాలలో ఒకటి.

బడ్జెట్ మీకు ఇంకా తక్కువ ఉంటే, మీరు ఇండియాలోనే సెలెబ్రేట్ చేసుకోడానికి మన దేశంలో కూడా ఫారెన్ తరహాలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటిని లింక్ క్లిక్ చేసి చూడండి.

టాపిక్

తదుపరి వ్యాసం