తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : మీరు సంతోషంగా ఉన్నారా? అయితే ఇంకేమి ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయండి..

Friday Motivation : మీరు సంతోషంగా ఉన్నారా? అయితే ఇంకేమి ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయండి..

18 November 2022, 6:36 IST

    • Friday Motivation : కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్న విషయాలే మనల్ని బాధపెడతాయి. మళ్లీ ఎప్పుడు సంతోషంగా ఉంటామో అని.. ఎన్నాళ్లు అయితుందో హ్యాపీగా ఉండి అని.. ఆ రోజులే బాగుండేవి అని వాటినే తలచుకుని బాధపడతాము.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : కొందరితో మనం కొన్ని జ్ఞాపకాలు ఏర్పరచుకుంటాము. వాళ్లు మనతో జీవితాంతం ఉంటారని భావిస్తాము. కానీ వాళ్లు మనల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతారు. ఆ సమయంలో మనం దూరం అయినందుకు బాధపడతాము. కానీ.. కొన్నాళ్లు గడిచిన తర్వాత.. మన జీవితం బాగుంటే పర్లేదు కానీ.. బాగోకుంటే మాత్రం.. ఆ రోజు వాళ్లతో ఎంత సంతోషంగా గడిపాను. ఎంత మంచిగా మాట్లాడుకునే వాళ్లం. అని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాము. మనం సంతోషంగానే ఉన్నా.. లేదా మూవ్ అయినా.. ఈ జ్ఞాపకాలే మనల్ని ఎక్కువగా బాధపెడతాయి.

ట్రెండింగ్ వార్తలు

Raw Mango Jam: పచ్చి మామిడితో పుల్లపుల్లని జామ్ ఇలా చేసేయండి, ఎంతో రుచి

Sweating Benefits : విపరీతంగా చెమట వస్తే మంచిదే.. ఈ ప్రయోజనాలు దక్కుతాయి

Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఇదొక కొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్, ఈ పెళ్లిలో ఆ ముచ్చటే ఉండదు

Parenting Tips : పిల్లలు కార్టూన్లు ఎందుకు చూడకూడదో తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి

జ్ఞాపకాలు మనతో ఉంటాయి కానీ.. ఆ రోజులు, ఆ మనుషులు మనతో ఉండరు కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ విషయాలే మనల్ని బాధపెడతాయి. ఏది ఏమైనా.. జీవితం ముందుకు సాగాలి. ఇలా రాసి పెట్టి ఉంటే మనం మాత్రం ఏమి చేస్తాము. గతాన్ని తవ్వుకుంటూ కూర్చులేము కదా. జరిగిన దానిని మనం మార్చలేకపోవచ్చు. భరించలేకపోవచ్చు. కానీ ఆ జ్ఞాపకాలతో మనం ముందుకు కూడా వెళ్లవచ్చు. మనకి ఎవరో దూరం అయ్యామని బాధపడతాము కానీ.. వారు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం మనకి సంతోషాన్నే ఇస్తాయి. ఆ జ్ఞాపకాలు మళ్లీ కావాలనుకున్నప్పుడు బాధ కలుగుతుంది. ఆ వ్యక్తి మనతో లేరు అన్నప్పుడు బాధపడతాము.

మనం సంతోషంగా ఉన్నప్పుడు.. మన చుట్టూ చాలా మంది ఉంటారు. మన జీవితంలో ప్రతిదీ ట్రాక్‌లో ఉంటుంది. కానీ మనం విచారంగా ఉన్నప్పుడు మాత్రం ఏది జరగాల్సిన విధంగా జరగదు. మనతో పాటు పరిస్థితులపై కంట్రోల్ తప్పిపోతుంది. ఇది మనల్ని చాలా బాధపెడుతుంది. కాబట్టి మనం జరిగిపోయిన వాటితో హ్యాపీగా ఉన్నా.. లేకున్నా.. ప్రస్తుతంపై దృష్టి పెట్టాలి. ఉన్నవాటితో సంతృప్తి పడాలి. అనుకున్న దానికంటే ఎక్కువ పొందితే ఆనంద పడాలి. అసలు లేకుంటే బాధపడకుండా.. వాటిని పొందడం కోసం కష్టపడాలి.

కొన్నిసార్లు ఈ సంతోషం కలకాలం ఉండదు అనే మూమెంట్ మనకి తెలిపోతూ ఉంటాయి. ఆ క్షణంలో మీరు ఇంకా హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఫ్యూచర్​లో కలిసి ఉండమేమో.. ఇబ్బందులు వస్తాయేమో.. దూరమైపోతామేమో అని ఆలోచిస్తూ.. ప్రజెంట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకండి. ఎందుకంటే అరె అప్పుడు అలా ఉంటే బాగుండేదే అని తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి.. మీరు ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు దానిని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి.. ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నించండి. అవి మీకు తర్వాత కూడా సంతోషాన్నే ఇస్తాయి.

తదుపరి వ్యాసం