తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menopause Weight Gain: మెనోపాజ్‌లో బరువు పెరుగుతున్నారా? ఇలా తగ్గిపోవచ్చు..

Menopause weight gain: మెనోపాజ్‌లో బరువు పెరుగుతున్నారా? ఇలా తగ్గిపోవచ్చు..

HT Telugu Desk HT Telugu

06 September 2023, 16:44 IST

  • Menopause weight gain: మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరిగిపోతుంటారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. అవేంటో చూసేయండి. 

మెనోపాజ్ లో బరువు పెరగకుండా జాగ్రత్తలు
మెనోపాజ్ లో బరువు పెరగకుండా జాగ్రత్తలు (pexels)

మెనోపాజ్ లో బరువు పెరగకుండా జాగ్రత్తలు

నలభై, నలభై అయిదేళ్లు దాటిన స్త్రీలలో మెనోపాజ్‌ వల్ల శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. రుతుక్రమం ఆగిపోవడానికి ముందు శరీరం తనని తాను సిద్ధం చేసుకోవడానికి ఈ మార్పులన్నీ వస్తాయి. దీనిలో భాగంగానే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఈ క్రమంలోనే చాలా మందిలో పొట్ట దగ్గరా కొవ్వు పట్టేస్తుంది. ఇవే కాకుండా అలసట, నీరసం, నిద్ర పట్టకపోవడం, చెమటలు పట్టేయడం, ఎముకలు తేలికగా విరిగిపోవడం, కండరాలు బలహీనమవడం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలూ తలెత్తుతుంటాయి. వీటన్నింటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటితోపాటు జీవన విధానంలోనూ మార్పు రావాలంటున్నారు. తద్వారా ఈ సమయంలో బరువును అదుపు చేసుకుంటూ, జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

ప్రొటీన్‌ ఫుడ్‌ అవసరం:

మెనోపాజ్‌ సమయంలో స్త్రీలు తక్కువలో తక్కువ రెండు మూడు కిలోలైనా బరువు పెరుగుతారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఈ సమయంలో శరీరం లోపల వచ్చే వాపుల నుంచి రక్షణ పొందవచ్చు.

ఫైటో ఈస్ట్రోజన్‌ ఆహారాలు తీసుకోవాలి:

మెనోపాజ్‌లో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయిలు బాగా తగ్గిపోతాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయట నుంచి ఫైటో ఈస్ట్రోజన్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సోయా బీన్స్‌, నువ్వులు, అవిసెలు, వెల్లుల్లి, పీచ్‌లు, బెర్రీలు , గోధుమ పొట్టు(తవుడు), బ్రోకలీ, క్యాబేజ్‌, డ్రైఫ్రూట్స్‌... తదితర ఆహార పదార్థాల నుంచి పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు చిక్కుళ్లు, చేపలు, తక్కువ కొవ్వులు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.

క్రమం తప్పకుండా వ్యాయామం:

మెనోపాజ్‌లో ఉన్న స్త్రీలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, బరువును నియంత్రించుకోవాలన్నా ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిందే. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతోపాటు రోజూ కచ్చితంగా శారీరక శ్రమను పెంచాలి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండటం వల్ల శరీర యాక్టివిటీని పెంచాలి. ఇంటి పనులు, గార్డెనింగ్‌, లిఫ్ట్‌లో కాకుండా మామూలుగా మెట్లెక్కి వెళ్లడం, ఫోన్‌ మాట్లాడేప్పుడు నడుస్తూ మాట్లాడటం లాంటి వాటిని పాటించాలి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఈ సమయంలో స్త్రీల బరువును నియంత్రించేందుకు ఏరోబిక్స్‌ బాగా సహాయ పడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఆహారాలు, వ్యాయామాల ద్వారా మెనోపాజ్‌ సమస్యల నుంచి తేలికగా బయటపడొచ్చంటున్నాయి.

తదుపరి వ్యాసం