తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Roast: ఎగ్ రోస్ట్ ఇలా చేసుకున్నారంటే డిన్నర్లో అదిరిపోతుంది, రెసిపీ చాలా సింపుల్

Egg Roast: ఎగ్ రోస్ట్ ఇలా చేసుకున్నారంటే డిన్నర్లో అదిరిపోతుంది, రెసిపీ చాలా సింపుల్

Haritha Chappa HT Telugu

24 February 2024, 17:30 IST

    • Egg Roast: గుడ్డుతో చేసిన వంటకాలకు అభిమానులు ఎక్కువ. అంతేకాదు గుడ్డుతో చేసే వంటకాలు చాలా త్వరగా ఉండొచ్చు. అలాంటిదే ఎగ్ రోస్ట్ రెసిపీ.
ఎగ్ రోస్ట్ రెసిపీ
ఎగ్ రోస్ట్ రెసిపీ (youtube)

ఎగ్ రోస్ట్ రెసిపీ

Egg Roast: కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రతిరోజూ ఒక కోడి గుడ్డును తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే లక్షణాలు కోడిగుడ్డులో ఉన్నాయి. కోడిగుడ్డుతో చేసే వంటకాలు చాలా త్వరగా అయిపోతాయి. పావుగంటలో వండి తినవచ్చు. అందుకే కోడిగుడ్లకు అభిమానులు ఎక్కువ. ఇక్కడ మేము కోడి గుడ్డుతో చేసే ఎగ్ రోస్ట్ రెసిపీ ఇచ్చాను. ఇది చూస్తేనే నోరూరిపోతుంది. ఇక తింటే మామూలుగా ఉండదు. వేడివేడి అన్నంలో ఈ ఎగ్ రోస్ట్ పెట్టుకొని తింటే ఆ కిక్కే వేరు. సాంబార్ కు సైడ్ డిష్ గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కేవలం పావుగంటలో తయారు చేసుకోవచ్చు. ఎగ్ రోస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ రోస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు

గుడ్లు - నాలుగు

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమోటా - ఒకటి

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - అరకప్పు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

మెంతులు - పావు స్పూను

మిరియాలు - అర స్పూను

ధనియాలు - ఒక స్పూను

కరివేపాకు - గుప్పెడు

యాలకులు - రెండు

లవంగాలు - ఆరు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఎగ్ రోస్ట్ రెసిపీ

1. ఎగ్ రోస్ట్ రెసిపీ తయారు చేయడానికి ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకోవాలి.

2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు వేసి వేయించండి.

3. ఆ తర్వాత కరివేపాకులు, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించండి.

4. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. మసాలా పొడి రెడీ అయినట్టే.

5. ఇప్పుడు ఉల్లిపాయలను, టమాటో ముక్కలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి.

6. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. ఆ నూనెలో ఉల్లిపాయ తరుగును వేసి వేయించండి.

7. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి వేయించండి. ఇవి బాగా వేగాక టమోటా ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టండి.

8. కాసేపటికి టమోటా ముక్కలు మెత్తగా ఇగురులాగా అవుతాయి.

9. ఇప్పుడు పసుపు, కారం వేసుకొని బాగా కలపండి.

10. ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసి కలపండి.

11. అరకప్పు నీళ్లను వేసి చిన్న మంట మీద పెట్టి మూత పెట్టండి.

12. కాసేపటికి పైకి నూనె తేలినట్టు కనబడుతుంది, అంటే ఇగురు రెడీ అయినట్టే.

13. ఇప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్లను రెండు ముక్కలుగా కోసి ఆ ఇగురులో పెట్టండి.

14. తర్వాత మూత పెట్టండి. నీరు ఇంకిపోయేదాకా చిన్న మంట మీద ఉడికించండి.

15. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది.

16. చపాతీలోకి, రోటీలోకి, అన్నం లోకి నోరూరుస్తుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు పదే పదే చేసుకుంటారు.

ఉడికించిన కోడి గుడ్డునే మనం ఎగ్ రోస్ట్ రెసిపీలో వినియోగించాము. కాబట్టి గుడ్డులో పోషకాలన్నీ ఉంటాయి. దీనిలో పొటాషియం, జింక్, విటమిన్లు, ఐరన్ ఇందులో అధికంగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి మనిషికి కావాల్సిన పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి. కండరాల నిర్మాణానికి గుడ్డు తినడం చాలా అవసరం. రోజుకు ఒక మనిషి రెండు గుడ్ల వరకు తీసుకోవచ్చు.

ఇక అధిక బరువుతో బాధపడుతున్న వారు ఒక గుడ్డుతోనే ఆపేయాలి. ఈ ఎగ్ రోస్ట్ కచ్చితంగా నచ్చుతుంది. గుడ్డు తినడం ద్వారా బరువు తగ్గవచ్చు. 12 వారాలు పాటు గుడ్డును తిని చూడండి. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే రోజుకి ఒక గుడ్డు లేదా రెండు గుడ్లతోనే ఆపేయాలి. అల్పాహారంగా రెండు గుడ్లను తినడం అలవాటు చేసుకుంటే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం