తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eggs In Summer : వేసవిలో గుడ్లు తినవచ్చా? ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది?

Eggs In Summer : వేసవిలో గుడ్లు తినవచ్చా? ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది?

Anand Sai HT Telugu

17 April 2024, 8:09 IST

    • Eggs In Summer : గుడ్లు ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవిలో వీటిని తీసుకోవచ్చా.. అని చాలా మందికి అనుమానం. ఆ విషయం గురించి తెలుసుకుందాం..
వేసవిలో గుడ్లు తింటే వచ్చే సమస్యలు
వేసవిలో గుడ్లు తింటే వచ్చే సమస్యలు (Freepik)

వేసవిలో గుడ్లు తింటే వచ్చే సమస్యలు

వేసవిలో గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా మంచి ఆహారం అనుకునేది వేసవిలో ఇబ్బందులు కలగవచ్చు. సాధారణంగా గుడ్లు ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు కలిగిస్తాయి. కానీ వేసవి వచ్చాక వీటి వినియోగం తగ్గించాలని చెబుతున్నారు నిపుణులు. కారణం గుడ్లు వేడి చేయడమే. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం గురించి తెలుసుకుందాం..

ట్రెండింగ్ వార్తలు

Worst Egg Combination : గుడ్లతో కలిపి తినకూడని ఆహారాలు.. సైడ్‌కి ఆమ్లెట్ కూడా వద్దండి

Flaxseeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం

Chanakya Niti Telugu : భార్య తన భర్త దగ్గర దాచే రహస్యాలు.. ఎప్పుడూ చెప్పదు!

వేసవిలో గుడ్లు ఎక్కువగా తినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దీని అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం. తక్కువ స్థాయిలో తింటే ఏం కాదు. మీ ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదు. వేసవిలో ఎక్కువగా గుడ్లు తింటే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వేడిని పెంచుతుంది

వేసవిలో గుడ్లు తింటే కడుపులో వేడి పెరుగుతుంది. కారణం గుడ్లు వేడి చేయడమే. వేసవిలో వీటిని ఎక్కువగా తింటే ముఖంపై మొటిమలు వస్తాయి. అంతే కాకుండా ఇది ఎసిడిటీ, మంటను కూడా కలిగిస్తుంది. అందుకే వేసవిలో గుడ్ల వినియోగం వీలైనంత తగ్గించాలి. కొందరు ఆమ్లెట్ వేసుకుని ఎక్కువగా తింటారు.

జీర్ణ సమస్య

వేసవిలో గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా కడుపునొప్పి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీనితోపాటుగా ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. వేసవిలో గుడ్డు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. మితంగా తినండి. కొంతమందికి గుడ్లు తిన్న తర్వాత వాంతి వచ్చినట్టుగా అవుతుంది. అలాంటివారు ఎక్కువగా గుడ్లు తినకపోవడమే ఉత్తమం.

కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది

సాధారణంగా గుడ్లలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు వేసవిలో వీటిని ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది మెుత్తం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొలెస్ట్రాల్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు చూడాల్సి వస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినవచ్చా?

గుడ్లు, మధుమేహం గురించి చర్చించేటప్పుడు తలెత్తే ఒక సాధారణ ఆందోళన రక్తంలో చక్కెర స్థాయిలపై వాటి ప్రభావం. అనేక అధ్యయనాలు గుడ్లు తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్న చాలా మందిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రతికూలంగా ప్రభావితం కావని చెబుతున్నాయి. వాస్తవానికి కొన్ని అధ్యయనాలు గుడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని సూచిస్తున్నాయి. ఇది డయాబెటిస్ నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివిధ అధ్యయనాలు.. నాణ్యత, తగినంత మొత్తంలో సహజ ప్రోటీన్ తీసుకోవడం చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుందని నిరూపించాయి. ఇది ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండదని నమ్ముతారు.

డయాబెటిస్ ఆహారంలో గుడ్లు విలువైన ఆహారం అయినప్పటికీ, వ్యక్తిగత ఆరోగ్య కారకాలు, ఆహార ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. సగటు గుడ్డులో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో కూడిన 6 గ్రాముల అధిక-నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన యొక్క పోషణ చాలా భిన్నంగా ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో సగం ప్రొటీన్లు, 15 కేలరీలు మాత్రమే ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్డులోని తెల్లసొన తీసుకోవడం కచ్చితంగా ప్రయోజనకరం.

తదుపరి వ్యాసం