తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fast Eating Side Effects : త్వరత్వరగా తింటే శరీరానికి ఏమవుతుందో తెలుసా?

Fast Eating Side Effects : త్వరత్వరగా తింటే శరీరానికి ఏమవుతుందో తెలుసా?

Anand Sai HT Telugu

03 February 2024, 13:30 IST

    • Fast Eating Disadvantages : కొందరికి త్వరత్వరగా తినడం అలవాటు ఉంటుంది. దీని వలన చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏదైనా సరే ఫాస్ట్‌గా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
త్వరత్వరగా తింటే ఆరోగ్య సమస్యలు
త్వరత్వరగా తింటే ఆరోగ్య సమస్యలు (unsplash)

త్వరత్వరగా తింటే ఆరోగ్య సమస్యలు

మనం ఎంత మంచి ఆహారం తింటున్నామో కాదు.. ఎలా తింటున్నామనే విషయం కూడా చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారంతోపాటుగా నమిలి విధానం కూడా చాలా ముఖ్యం. చాలా మంది గాబరాగా తినేసి వెళ్తారు. హడావుడిలో తినడం అస్సలు మంచి పద్ధతి కాదు. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా త్వరగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Personality Test: ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మీకు మొదట ఏ జంతువు కనిపించిందో చెప్పండి, మీరు ఎలాంటి వారో మేము చెప్పేస్తాం

White Bed Sheets In Railway : రైలు స్లీపర్ కోచ్‌లలో తెల్లని బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారు..

తినేప్పుడు తొందరపడొద్దు

మనిషి జీవితంలో ముఖ్యమైన విషయం ఆహారం. ఇది లేకుండా మనిషికి జీవితమే లేదు. ఎంత పనిచేసినా కడుపు కోసమే. కానీ బతికేందుకు తినాలి.. కానీ తినడం కోసమే బతకొద్దు. ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. బాగుంది కదా అని హడావుడిగా తినొద్దు. మెల్ల మెల్లగా తీసుకోవాలి. అప్పుడే అది మీ శరీరానికి ఉపయోగపడుతుంది. లేదంటే నో యూజ్. మనం తినే ఆహారం తొందరపడకుండా ప్రశాంతంగా తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

వెనకాల తరముతున్నట్టుగా తినొద్దు

చాలా మందికి ఆహారం త్వరగా తినే అలవాటు ఉంటుంది. అలానే వేగంగా కాఫీ, టీ కూడా తాగుతుంటారు. ఎవరో వెనకాల నుంచి తరుముతున్నట్టుగా తినేస్తారు, తాగేస్తారు. ఇలా తినడం వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు. సమయం ఆదా అవుతుందేమో అంతకంటే ముఖ్యమైన మీ ఆరోగ్యం పాడవుతుంది.

త్వరత్వరగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా త్వరగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం వేగంగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాలి.

సరిగా జీర్ణం కాదు

తొందరపడి తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. వేగంగా తినడం అంటే మీరు ఆహారాన్ని సరిగ్గా నమలలేరు. నమలకుండా కడుపులోకి చేరిన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది కడుపులోనే ఉంటుంది. దీని వల్ల శరీర బరువు సులభంగా పెరుగుతుంది.

బరువు పెరుగుతారు

వేగంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బరువు పెరగడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే వేగంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనితో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

వేగంగా తినేవారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. మీ ఆహారాన్ని వీలైనంత నెమ్మదిగా తినడానికి ప్రయత్నించండి. బాగా నమలండి. అప్పుడే మీ శరీరానికి పోషకాలు అందుతాయి. కొలెస్ట్రాల్ సమస్యలు రావు. చాలా ఆరోగ్యంగా ఉంటారు.

నమలకుండా తింటే చాలా సమస్యలు

తొందరపాటుతో ఆహారం తీసుకోవడం వల్ల లాలాజలం సరిగ్గా కలిసిపోదు. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, త్రేనుపు, మలబద్ధకం కలిగిస్తుంది. సరిగా నమలకుండా తింటే మెుత్తం ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం కూడా బాగా నమిలి తినమని చెబుతుంది.

గ్యాస్ సమస్య పెరుగుతుంది

త్వరత్వరగా తినడం వలన చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. సరిగా జీర్ణం కాకపోడవం. దీనితో గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. గ్యాస్ సమస్యలు వస్తే.. వచ్చే ప్రధాన సమస్యలు చాలా ఉంటాయి. ఆందోళన కలుగుతుంది. గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే సరిగా నమిలి తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

తదుపరి వ్యాసం