తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Multigrain Rotis Recipe । రోటీలను ఇలా చేసుకొని తింటే 'బహుళ' ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు!

Multigrain Rotis Recipe । రోటీలను ఇలా చేసుకొని తింటే 'బహుళ' ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు!

HT Telugu Desk HT Telugu

29 January 2023, 6:06 IST

    • Multigrain Rotis Recipe: ఆదివారం పూట ఆరోగ్యకరంగా తినండి. మంచి ప్రోటీన్లు, విటమిన్లు దండిగా ఉండేటువంటి మిల్లెట్ల పిండితో మల్టీగ్రెయిన్ రోటీలను చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Multigrain Rotis Recipe
Multigrain Rotis Recipe (Unsplash)

Multigrain Rotis Recipe

ప్రతీరోజూ వివిధ పనులు, ఒత్తిళ్లతో ఉదయం వేళ సరిగా అల్పాహారం కూడా చేయలేకపోతాం. ఆదివారం చాలా మందికి సెలవు రోజు, మరి ఈ ఒక్కరోజైనా కాస్త ఆలస్యంగానైనా, ఓపికగా ఏదైనా చేసుకొని తినడంలో తప్పేముంది? మీకు ఈరోజు చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీని పరిచయం చేస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

రోటీలు ఏదైనా కూరతో అల్పాహారంగా తినొచ్చు, మధ్యాహ్నం లంచ్‌లోకి, అలాగే డిన్నర్‌లోకి కూడా తినొచ్చు. అయితే రెగ్యులర్‌గా చేసుకునే రోటీలకి బదులుగా వివిధ రకాల తృణధాన్యాలను పిండిగా చేసి దానితో మల్టీగ్రెయిన్ రోటీలు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. ఈ బహుళ ధాన్యపు రోటీలను ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది, చూడండి.

Multigrain Rotis Recipe కోసం కావలసినవి

  • 1/2 కప్పు ఓట్స్
  • 1/2 కప్పు మిల్లెట్ పిండి (రాగి పిండి, జొన్న పిండి మిశ్రమం)
  • 1/2 కప్పు మొత్తం గోధుమ పిండి
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • వేడి నీరు అవసరమైనంత

మల్టీగ్రెయిన్ రోటీలు తయారు చేసే విధానం

  1. ముందుగా ఓట్స్‌ను బ్లెండర్‌లో గ్రైండ్ చేసి మెత్తని పిండిగా చేయండి.
  2. ఆ తర్వాత ఈ ఓట్స్ పిండిలో 3/4 కప్పు వేడి నీరు కలిపి ముద్దగా చేసి 5 నిమిషాలు పక్కన పెట్టండి
  3. ఇప్పుడు అదే గిన్నెలో గోధుమ పిండి, మిల్లెట్ పిండిని వేసి కొన్ని వేడి నీరు కలపండి. అన్ని పిండ్లు తేలికగా, జిగటగా మారే వరకు కలపండి.
  4. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకొని పిండిని బాగా పిసకండి. అనంతరం గిన్నెపై తడిగా ఉన్న గుడ్డ కప్పండి. సుమారు అరగంట పక్కన పెట్టండి.
  5. ఇప్పుడు పాన్ వేడి చేసి, ఆపై 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి.
  6. పిండి ముద్దను చిన్నచిన్న ముద్దలుగా విభజించుకొని ఒక్కొక్కటిగా చపాతీలాగా కాల్చుకోండి.

అంతే, బహుళ ధాన్యపు రోటీలు సిద్ధం. చికెన్, మటన్, ఖీమా లేదా మీకు నచ్చిన వెజ్ కూరతో తినవచ్చు.

తదుపరి వ్యాసం