తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cico Diet : బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా.. ఈ ఒక్క డైట్ చాలట..

CICO Diet : బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా.. ఈ ఒక్క డైట్ చాలట..

10 November 2022, 13:46 IST

    • బరువు తగ్గాలి.. ఫిట్​గా ఉండాలి అనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దానిలో భాగంగానే వాళ్లు డైట్స్ చేస్తారు. అయితే ఇప్పుడు సరికొత్త డైట్​ తెరపైకి వచ్చింది. అదే CICO Diet. మరి దీని గురించి మీకు తెలుసా? బరువు తగ్గడానికి ఇది మీకు ఎంత వరకు సహాయం చేస్తుంది? అసలు CICO Diet అంటే ఏమిటి?
 CICO Diet
CICO Diet

CICO Diet

CICO Diet : CICO అంటే "క్యాలరీలు ఇన్, క్యాలరీలు అవుట్". మీరు రోజూ ఎంత కేలరీలు బర్న్ చేస్తున్నారో.. దానికంటే తక్కువ కేలరీలను తీసుకోవడమే ఈ డైట్ ముఖ్య ఉద్దేశం. ఇది బరువు తగ్గడం లేదా బరువు పెరగడం.. రెండింటికీ చాలా సముచితమైనది. ఎందుకంటే ఇది మీ క్యాలరీ వినియోగంపై పక్కాగా తనిఖీ చేస్తుంది. మరి ఈ డైట్ ప్రయోజనాల నుంచి దుష్ప్రభావాల వరకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Raw Mango Jam: పచ్చి మామిడితో పుల్లపుల్లని జామ్ ఇలా చేసేయండి, ఎంతో రుచి

Sweating Benefits : విపరీతంగా చెమట వస్తే మంచిదే.. ఈ ప్రయోజనాలు దక్కుతాయి

Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఇదొక కొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్, ఈ పెళ్లిలో ఆ ముచ్చటే ఉండదు

Parenting Tips : పిల్లలు కార్టూన్లు ఎందుకు చూడకూడదో తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి

కేలరీల లెక్క పక్కాగా ఉండాల్సిందే..

ఈ డైట్​లో కేలరీలను లెక్కించడం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఇది మీ శక్తి అవసరాలను నిర్ణయించడానికి.. మీ కేలరీల లోటును పరిగణనలోకి తీసుకుంటుంది. ముందుగా శ్వాస, హృదయ స్పందన, జీర్ణక్రియ, వ్యాయామం మొదలైన ప్రాథమిక శరీర విధులకు అవసరమైన మీ బేసల్ మెటబాలిక్ రేటు (BMR)ని లెక్కిస్తారు. తద్వార మీకు రోజుకు కావలసిన కేలరీలను లెక్కిస్తారు. మీరు బరువు తగ్గడానికి తక్కువ కేలరీలు, బరువు పెరగడానికి ఎక్కువ కేలరీలు తీసుకుంటారు.

బరువు నిర్వహణలో కేలరీల పాత్ర చాలా ముఖ్యమైనది. ఒక రోజులో మీరు తీసుకునే కేలరీలు మీ బరువుపై ప్రభావం చూపుతాయన్నది నిజం. కాబట్టి ఈ డైట్​ కేవలం కేలరీల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునేవారికి, పెరగాలి అనుకునేవారికి సహాయపడుతుంది. అయితే ఆరోగ్యకరమైన బరువు కావాలనుకునేవారికి మాత్రం కేవలం కేలరీల మీద మాత్రమే శ్రద్ధ చూపిస్తే సరిపోదు. ఆరోగ్యకరంగా బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా.. నిర్వహణలో కేవలం క్యాలరీ లోటు కంటే.. ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని ఎక్కువ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

CICO Diet వల్ల కలిగే ప్రయోజనాలు

* బహుళ ఆరోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో CICO Diet సహాయపడుతుంది.

* అనారోగ్యకరంగా బరువు పెరగడం నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మరింత కాపాడుతుంది.

* గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని క్యాన్సర్‌ల నుంచి, డిప్రెషన్, స్లీప్ అప్నియా, శ్వాసకోశ సమస్యల వరకు.. శరీరంలోని అదనపు కొవ్వును పెరగకుండా చూస్తుంది.

* దీనికి అదనంగా మీరు ఈ డైట్​లో ఉన్నప్పుడు ఆక్సీకరణ ఒత్తిడిని కోల్పోతారు. ఇది మీ హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

CICO Diet ప్రతికూలతలు

* పోషకాల లోపం, కేలరీలు సరిపోకపోవడం వల్ల అనేక ప్రమాదాలకు దారితీయవచ్చు.

* కేలరీలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ముఖ్యమైన పోషకాలను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

* ఇది జుట్టు రాలడం, ఊబకాయం, మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు, మెదడు వ్యాధులు, వాపు, బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.

* అదనంగా కేలరీల లోపం వల్ల వ్యాయామం చేయడంలో ఇబ్బందులు వచ్చే అవకాశముంది.

తదుపరి వ్యాసం