తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti About Friendship। స్నేహం గురించి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు!

Chanakya Niti About Friendship। స్నేహం గురించి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు!

HT Telugu Desk HT Telugu

06 August 2023, 7:07 IST

    • Chanakya Niti About Friendship: ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఆచార్య చాణక్యుడు కూడా స్నేహం గురించి తన అభిప్రాయాలను నీతిశాస్త్రంలో వివరించారు.
Chanakya Niti About Friendship:
Chanakya Niti About Friendship: (istock)

Chanakya Niti About Friendship:

Chanakya Niti About Friendship: ఆచార్య చాణక్యుడు ఒక తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, న్యాయ శాస్త్రవేత్తగా, రాజ సలహాదారుగా ప్రఖ్యాతిగాంచాడు. ఆయన తన వ్యూహాలతో మౌర్య సామ్రాజ్య స్థాపనకు ప్రధాన కారకుడుగా నిలిచాడు, చంద్రగుప్త మౌర్యుని పాలనలో ప్రధానమైన మంత్రిగా పనిచేశాడు. చాణక్యుడికి కౌటిల్యుడు అనే పేరు కూడా ఉంది. చాణక్యుడు అర్థశాస్త్రం, చాణక్య నీతి అనే రెండు గ్రంథాలు రచించాడు. ఇందులో అర్థశాస్త్రం ఆర్థికపరమైన సలహాలు ఇవ్వగా, చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన అనేక అంశాల గురించి వివరించాడు. ఆయన తన నీతిశాస్త్రంలో చేసిన విలువైన బోధనలు నేటికీ అనుసరనీయమే.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

చాణక్య నీతి చాలా విలువైన పాఠాలను కలిగి ఉన్నప్పటికీ, ఈరోజు స్నేహితుల దినోత్సవం (Happy Friendship Day) కాబట్టి, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని స్నేహబంధం గురించి చెప్పుకుందాం. ఆచార్య చాణక్యుడు కూడా స్నేహం గురించి తన అభిప్రాయాలను నీతిశాస్త్రంలో వివరించారు. ఆయన స్నేహంపై చేసిన కొన్ని సూక్తులను ఇప్పుడు తెలుసుకుందాం.

స్నేహం గురించి కొన్ని ఉత్తమ చాణక్య కొటేషన్లు

  • స్నేహం ఎప్పుడూ మీ స్థాయికి తగిన వారితో చేయాలి. మీ స్టేటస్‌లో మీకు పైన లేదా కింద ఉన్న వ్యక్తులతో చేసే స్నేహాలు మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వవు. - ఆచార్య చాణక్యుడు
  • ఒక వ్యక్తి ముఖంగా అద్దంలో ప్రతిబింబించినట్లే అతడి వ్యక్తిత్వం అనేది అతడి స్నేహితుల ఎంపికలో ప్రతిబింబిస్తుంది. - ఆచార్య చాణక్యుడు (స్నేహాలు, పరిచయాలను ఏర్పరచుకోవడంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, అవే మన జీవితాన్ని నిర్ణయిస్తాయని అని చాణక్యుడు హెచ్చరించాడు)
  • ప్రతి స్నేహం వెనుక కొంత స్వార్థం ఉంటుంది. స్వప్రయోజనాలు లేకుండా ఏ స్నేహం లేదు. ఇది చేదు నిజం. - ఆచార్య చాణక్యుడు
  • శత్రువు బలహీనత తెలిసే వరకు, అతణ్ని మీ మిత్రుని వలె చూసుకోవాలి, శత్రువుకి శత్రువు కూడా మీ మిత్రుడే. - ఆచార్య చాణక్యుడు
  • మీరు గౌరవించబడని, మీ జీవనోపాధిని పొందలేని, మీకు స్నేహితులు అంటూ లేని లేదా మీరు జ్ఞానాన్ని పొందలేని దేశంలో ఎప్పటికీ నివసించవద్దు. - ఆచార్య చాణక్యుడు
  • మీ ఎదిగిన పిల్లలు మీకు మంచి స్నేహితులు అవ్వాలంటే.. మొదటి ఐదు సంవత్సరాలు మీ పిల్లలను చాలా ప్రేమగా చూసుకోండి. ఆ తర్వాత ఐదేళ్లపాటు వారిపై కఠినంగా ప్రవర్తించండి. పదహారేళ్లు వచ్చేసరికి వారిని స్నేహితుడిలా చూసుకోండి.- ఆచార్య చాణక్యుడు
  • ఎక్కువ మంది నమ్మకద్రోహం చేసే స్నేహితులు ఉండటం కంటే, నమ్మదగిన స్నేహితుడు ఒక్కడు ఉన్నా మేలు. - ఆచార్య చాణక్యుడు

చాణక్య నీతి ద్వారా స్నేహం గురించి తెలిపిన ఈ సూత్రాలు మీరు మంచి స్నేహితులను కలిగి ఉండేలా ప్రేరేపించవచ్చు. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోవడంలో మీకు ఈ చాణక్య నీతులు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. మీకు, మీ మిత్రులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఫ్రెండ్స్ తో వేడుక చేసుకోండి.

తదుపరి వ్యాసం