తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu। ఎవరినైనా మీ నియంత్రణలో పెట్టుకోవాలా? ఇవిగో చాణక్య వ్యూహాలు!

Chanakya Niti Telugu। ఎవరినైనా మీ నియంత్రణలో పెట్టుకోవాలా? ఇవిగో చాణక్య వ్యూహాలు!

HT Telugu Desk HT Telugu

05 August 2023, 7:07 IST

    • Chanakya Niti Telugu: మీరు మీ మాటకు ఇతరులు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే చాణక్యుని నీతిలో పేర్కొన్న కొన్ని పద్ధతులను ఇక్కడ తెలుసుకోండి. 
Chanakya Niti Telugu
Chanakya Niti Telugu (Unsplash)

Chanakya Niti Telugu

Chanakya Niti Telugu: మనం ఎవర్నైనా మన మాట వినేలా ఒప్పించాలంటే, వారిని మన నియంత్రణలో పెట్టుకోవాలంటే అది చాలా కష్టమైన పని, అందరికీ ఇది సాధ్యం కాదు. కానీ కొందరిలో మాత్రమే ఈ నేర్పు ఉంటుంది. అయితే భారతీయ పురాతన తత్వవేత్త అయిన ఆచార్య చాణక్యుడికి ఈ విషయాలపై చాలా స్పష్టత ఉంది. ఆయనకు ఎవర్నైనా తన మాట వినేలా, తన నియంత్రణలో పెట్టుకునే శక్తి ఉంది. అందుకే నేటికీ ఆయన బోధనలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఆచార్య చాణక్యుడు ఏ వ్యక్తినైనా ఎలా మనం నియంత్రణలో పెట్టుకోగలమో కొన్ని కిటుకులను తన నీతిశాస్త్రం ద్వారా తెలియపరిచాడు. మీరు కూడా మీ మాటకు ఇతరులు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే చాణక్యుని నీతిలో పేర్కొన్న కొన్ని పద్ధతులను ఇక్కడ తెలుసుకోండి. మీరు ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా ఎవరినైనా మీ మాట వినేలా చేసుకోగలుగుతారు.

చాణక్యుడి మాట

ఏదైనా విషయాన్ని సాధారణ ప్రజలకు అప్పగించే ముందు లేదా వారికి ఏదైనా విషయంపై సమాచారం ఇచ్చే ముందు దాని గురించి పూర్తి సమాచారం లేదా జ్ఞానం కలిగి ఉండటం ముఖ్యం. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా తమ ఆలోచనలను మార్చుకోని మొండి వైఖరి కలవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారి ఆలోచనా ధోరణిని మార్చడానికి మనం ముందుగా విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అదే సమయంలో వ్యక్తి స్వభావం ఎలాంటిది, ప్రజల నాడీ ఎలా ఉంది అనేది గ్రహించాలి. వ్యక్తుల స్వభావానికి తగినట్లుగా మన ప్రవర్తన ఉంటే వారిని అదుపులో ఉంచవచ్చు.

1. అత్యాశ గల వ్యక్తి

డబ్బు ఇవ్వడం లేదా ఏదైనా ఆశ చూపడం ద్వారానే అత్యాశగల వ్యక్తిని ఒప్పించగలమని చాణక్య నీతి చెబుతుంది. అంటే మీరు డబ్బు లేకుండా అత్యాశగల వ్యక్తిని ఏ విధంగానూ ఆకర్షించలేరు. వారికి కొంత డబ్బు ఇచ్చినప్పుడు, లేదా వారు కోరుకున్నది ఇచ్చినపుడు వారు మీ మాటలను అంగీకరిస్తారు.

2. తెలివితక్కువ వ్యక్తి

తెలివితక్కువ వ్యక్తిని ఒప్పించాలంటే, అతని మనస్తత్వం చూసి, ఆ తర్వాత దానికి తగ్గట్లుగా మీరు పని చేయాలి. వారికి నచ్చినట్లుగా పనిచేస్తే అది అతనికి సంతోషాన్నిస్తుంది, అప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తాడు. అప్పుడే మీరు చెప్పినదల్లా చేయగలుగుతాడు.

3. తెలివైన వ్యక్తి

తెలివైన వ్యక్తితో తెలివిగానే మాట్లాడాలి, అతితెలివితో మాట్లాడకూడదు. నిజాలు చెప్పాలి, తార్కికంగా మాట్లాడటం ద్వారా మీరు చెప్పే ఏ విషయాన్నైనా అంగీకరిస్తారు, కానీ దీని కోసం, మీరు తెలివైన వారై ఉండాలి, అన్నీ తెలిసిన వారు ఉండాలి. లేకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినరు. మిమ్మల్ని లెక్కచేయరు.

4. గర్విష్ఠుడు

అహంకారి వ్యక్తిని ఒప్పించడానికి లేదా నియంత్రించడానికి మీరు వారికి నమస్కరించాలి. గౌరవంతో మాట్లాడినట్లు చేయాలి. ముకుళిత హస్తాలతో వారిని వేడుకుంటూ లేదా వారికి తల వంచినట్లు ప్రవర్తిస్తే, వారే తెలియకుండా మీకు బానిసలు అవుతారు అని చాణక్య నీతి పేర్కొంది. అహంకారులు ఎవరి మాట వినరు, తమ దారే సరైనదని భావిస్తారు. వారు తమ స్వంత కారణాల వల్ల ఇతరుల మాటలకు విలువ ఇవ్వరు. కాబట్టి వారు కోరుకునే విలువ వారికిస్తూ వ్యవహరాలను చక్కబెట్టవచ్చు.

చాణక్యుడి నీతి ప్రకారం మీరు ఎవరినైనా ఒప్పించే ముందు, వారి వ్యక్తిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, వారి స్వభావానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం