తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cauliflower Aloo Paratha: అల్పాహారంలోకి రుచికరమైన క్యాలీఫ్లవర్ ఆలూ పరాటా..

Cauliflower aloo paratha: అల్పాహారంలోకి రుచికరమైన క్యాలీఫ్లవర్ ఆలూ పరాటా..

HT Telugu Desk HT Telugu

30 May 2023, 6:30 IST

  • Cauliflower aloo paratha: క్యాలీఫ్లవర్, ఆలూతో పరాటాలు సులువుగా ఎలా చేసుకోవాలో చూసేయండి. 

క్యాలీఫ్లవర్ ఆలూ పరాటా
క్యాలీఫ్లవర్ ఆలూ పరాటా (Unsplash)

క్యాలీఫ్లవర్ ఆలూ పరాటా

ఉదయాన్నే అల్పహారంలోకి పరాటాలు తినే అలవాటుంటుంది. అయితే ఎప్పుడూ తినే వాటికి భిన్నంగా క్యాలీఫ్లవర్ తో ఒకసారి ఈ పరాటా ప్రయత్నించి చూడండి. క్యాలీఫ్లవర్ ఇష్టపడని వాళ్లు కూడా ఇష్టంగా తింటారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు గోధుమపిండి

సగం కప్పు క్యాలీఫ్లవర్ తురుము

సగం చెంచా కారం

సగం కప్పు ఉడికించిన బంగాళదుంప ముద్ద

ఒక ఉల్లిగడ్డ

పావు చెంచా పసుపు

4 స్పూన్ల నూనె

1 చెంచా నెయ్యి

కొత్తిమీర కొద్దిగా

1 పచ్చిమిర్చి తరుగు

1 చెంచా జీలకర్ర

ఉప్పు తగినంత

నీళ్లు తగినన్ని

తయారీ విధానం:

  1. గోదుమపిండిలో ఉప్పు, నూనె వేసుకుని మెత్తగా తడుపుకోవాలి. ఒక తడిగుడ్డ కప్పి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
  2. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. అందులోనే క్యాలీఫ్లవర్ తురుము కూడా వేసుకోవాలి.
  3. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుని రెండు చెంచాల నీళ్లు పోసుకుని క్యాలీఫ్లవర్ మగ్గనివ్వాలి. నీళ్లు ఇంకిపోయాక బంగాళదుంప ముద్ద కూడా వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపేయాలి.
  4. ఇప్పుడు గోదుమపిండిని ఉండలుగా చేసుకుని కాస్త మందంగా చపాతీలాగా చేసుకోవాలి. మధ్యలో క్యాలీఫ్లవర్ స్టఫింగ్ ముద్ద పెట్టుకోవాలి.
  5. అన్ని వైపులా పిండితో మూసేసి చపాతీకన్నా కాస్త మందంగా ఒత్తుకుని, పెనం మీద నూనె లేదా నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. దీన్ని టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీతో తినొచ్చు.

తదుపరి వ్యాసం