తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Cold Remedies । వేసవిలో జలుబు చేస్తుందా? కారణాలు, నివారణ మార్గాలు చూడండి!

Summer Cold Remedies । వేసవిలో జలుబు చేస్తుందా? కారణాలు, నివారణ మార్గాలు చూడండి!

HT Telugu Desk HT Telugu

26 April 2023, 14:15 IST

    • Summer Cold Remedies:  ఎండాకాలంలోనూ జలుబు సాధారణమే. వాతావరణ మార్పులు, విపరీతమైన వేడి కారణంగా వేసవిలోనూ కొందరికి జలుబు చేస్తుంది. ముక్కు కారటం, గొంతు నొప్పి ఇతర లక్షణాలు ఉంటాయి. నివారణ మార్గాలను చూడండి.
Summer Cold Remedies
Summer Cold Remedies (istock)

Summer Cold Remedies

Summer Health Care: వేసవిలో జలుబు ఏంటని అనుకుంటున్నారా? ఇది వేసవి కాలంలో వచ్చే జలుబు కాబట్టి. దీనిని వేసవి జలుబు (Summer Cold) అనుకోవచ్చు. చాలా మంది జలుబును చలికాలం, వర్షాకాలం లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందనుకుంటారు. కానీ జలుబు రావడానికి బయట చల్లగా ఉండవలసిన అవసరం లేదు. ఇది ఎప్పుడైనా రావచ్చు, వాతావరణం మారినపుడు కూడా రావచ్చు. అలాగే మండే ఎండలోనూ జలుబు చేయవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వారిలో ఈ సమస్య ఉంటుంది. అయితే వేసవిలో వచ్చే జలుబును అలర్జీగా కూడా పొరపడే అవకాశం ఉంటుంది. కానీ లక్షణాలను బట్టి జలుబు చేసిందా లేక అలర్జీనా అని నిర్ధారించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Summer Cold Symptoms- వేసవిలో జలుబు లక్షణాలు

వేసవిలో వచ్చే జలుబు సరిగ్గా చలికాలంలో కలిగే జలుబులాగే ఉంటుంది. ఇది కూడా సాధారణ జలుబు (Common Cold) లాంటిదే, ప్రత్యేకమైన సమస్య ఏం కాదు. ఈ జలుబు రావడానికి ప్రధాన కారణం రైనోవైరస్ అనే వైరస్. ఇది ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలను పరిశీలిస్తే.. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారటం, ముక్కు మూసుకుపోవడం, గొంతులో గరగర, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అయితే వేసవి జలుబులో చెమటలు పట్టడం, జ్వరం వంటి ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు.

సాధారణంగా ఈ లక్షణాలన్నీ ఒకటి నుండి రెండు వారాల తర్వాత వాటంంతటవే తగ్గుముఖం పడతాయి. దీనిని బట్టి మీకు ఉన్నది జలుబుగా నిర్ధారించవచ్చు. ఒకవేళ లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, బహుశా అది అలెర్జీలు లేదా మరేదైనా కారణం కావచ్చు. ఈ సందర్భంలో మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

కాగా, వేసవిలో కలిగే జలుబుకు ఇంటి చిట్కాలతోనే పరిష్కారం అందించవచ్చు. అందుకు మార్గాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Summer Cold Remedies- వేసవిలో జలుబుకు నివారణ మార్గాలు

  • తగినంత నీరు త్రాగాలి, ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కొద్దిగా తేనె కలుపుకొని తాగడం వలన ముక్కు దిబ్బడ సమస్యలు తొలగిపోతాయి. అల్లం ఛాయ్, అలాగే ఏవైనా సూపులు తాగడం ద్వారా గొంతు నొప్పి తగ్గుతుంది.
  • అదే సమయంలో ఆల్కహాల్, కాఫీ లేదా కెఫిన్ కలిగిన కూల్ డ్రింక్స్ తాగటం మానేయాలి.
  • జలుబు నుంచి తక్షణ ఉపశమనం కోసం ఉప్పు నీటితో నోటిని పుక్కిలించాలి (Salt Water Gargling). ఉప్పు సహజమైన క్రిమినాశక, నొప్పి నివారణ స్వభావాలను కలిగి ఉంటుంది. జలుబును ఎదుర్కోవడంలో ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది.
  • నాసికా రంధ్రాలు మూసుకుపోతే హ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించండి. లేదా మూసుకుపోయిన నాసికారంధ్రాలను తెరవడానికి ఆవిరి పట్టండి. దీంతో మీకు హాయిగా అనిపిస్తుంది, స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
  • తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఒక చెంచాడు తేనే తాగండి ఇది గొంతును మృదువుగా మారుస్తుంది. గొంతు ద్వారా ఆహరం సరఫరా సులభతరం చేస్తుంది.
  • జలుబు లేదా దగ్గును నివారించటానికి పసుపు పాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. పసుపు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి, మంటను తగ్గిస్తుంది.
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట మంచిగా నిద్రపోవడం వలన జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

వీటితో పాటు రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుకునే చర్యలు తీసుకోండి, ఎల్లప్పుడూ చురుగ్గా ఉండండి. జలుబు కలిగిన వారికి దూరంగా మెలగండి.

టాపిక్

తదుపరి వ్యాసం