తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Hair Care । కాలుష్యంతో జుట్టు నిర్జీవంగా మారితే.. ఇంట్లోనే హెయిర్ స్పా చేసి జీవం పోయండి!

Diwali Hair Care । కాలుష్యంతో జుట్టు నిర్జీవంగా మారితే.. ఇంట్లోనే హెయిర్ స్పా చేసి జీవం పోయండి!

HT Telugu Desk HT Telugu

25 October 2022, 11:02 IST

    • Diwali Hair Care: దీపావళి వేళ దుమ్ము, కాలుష్యంతో మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా మారిందా? ఇంట్లోనే ఇలా సహజంగా హెయిర్ స్పా చేసుకుంటే మళ్లీ ఆరోగ్యంగా తయారవుతుంది.
Diwali Hair Care
Diwali Hair Care (Unsplash)

Diwali Hair Care

Diwali Hair Care: దీపావళి తర్వాత కాలుష్యంతో జుట్టంతా జీవం కోల్పోయి, పొడిగా మారవచ్చు. మళ్లీ మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయాలనుకుంటే పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉంటూ మీ జుట్టును పార్లర్‌లో చేసేటట్లుగా చేసుకోవచ్చు. ఇందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అయితే ముందుగా జుట్టును శుభ్రం చేసుకోవడం అవసరం. జుట్టులో జిడ్డు ఉంటే శుభ్రపరుచుకోవాలి, ఆ తర్వాత హెయిర్ స్పా చేసుకోవాలి. ఇందుకోసం అనుసరించాల్సిన దశలను ఒక్కొక్కటికి తెలియజేస్తున్నాం. వరుస క్రమంలో అనుసరించండి. ఆ తర్వాత మీ జుట్టు మృదువుగా, ఎంతో అందంగా తయారవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

ఆయిలింగ్- షాంపూ

ముందుగా జుట్టుకు కుదుళ్ల నుంచి నూనె పట్టించాలి, ఆపై కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. నూనె పెట్టిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత జుట్టును షాంపూతో కడగాలి. ఇప్పుడు జుట్టుకు హెయిర్ మాస్క్ వేసుకునే సమయం వచ్చింది.

హెయిర్ మాస్క్

హెయిర్ మాస్క్ చేయడానికి అరటిపండు, అలోవెరా జెల్‌ను మిక్సీలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. మీరు ఈ హెయిర్ మాస్క్ ను కుదుళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

జుట్టుకు ఆవిరి

జుట్టుకు ఆవిరి పట్టడం కూడా చాలా ముఖ్యం. ఈ హెయిర్ మాస్క్‌ను ధరించే స్టీమింగ్ చేసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటిలో ఒక టవల్‌ను ముంచి, నీరు పిండేసి దానిని జుట్టుకు చుట్టాలి. 5-10 నిమిషాల తర్వాత తీసేసి మళ్లీ తేలికపాటి షాంపూతో కడిగేసుకోండి.

అలోవెరా జెల్

అలోవెరా జెల్ జుట్టుకు కండీషనర్ లాగా పనిచేస్తుంది. షాంపూ చేసిన తర్వాత జుట్టు పొడవుకు కలబంద జెల్ రాయాలి. ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.

ఈ రకంగా సహజమైన రీతిలో హెయిర్ స్పా చేసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం