తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sitting Position : కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటున్నారా?

Sitting Position : కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటున్నారా?

Anand Sai HT Telugu

28 January 2024, 13:30 IST

    • Sitting Position Health Problems : మనం కూర్చొనే విధానం కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటే కూడా వివిధ సమస్యలు వస్తాయి.
కూర్చొనే విధానంతో సమస్యలు
కూర్చొనే విధానంతో సమస్యలు (Unsplash)

కూర్చొనే విధానంతో సమస్యలు

మీరు మీ ఆఫీసు, రెస్టారెంట్‌ వెళితే ఎలా కూర్చుంటారో ఎప్పుడైనా గమనించుకున్నారా? చాలా మందికి ఒక కాలుపై మరొక కాలు వేసుకుని కూర్చోవడం సౌకర్యంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తే కూడా ఇదే కనిపిస్తుంది. మీకు కూడా ఇదే ఇష్టమై ఉండవచ్చు. ఇలా కూర్చోవడం ఒక రకంగా అలవాటు అయిపోయింది. మనకు తెలియకుండానే కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటాం. ఈ భంగిమలో కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఎవరూ ఆలోచించరు.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

ఒకవైపు కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మీకు ప్రమాదం ఉందని అర్థం కాదు. కానీ ఇది మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రక్తపోటును పెంచుతుంది. మోకాలి సమస్యలు, తిమ్మిరికి దారితీస్తుంది. గర్భిణీలు కూడా ఈ భంగిమకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది జనన సంబంధిత సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ మరియు జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన రెండు అధ్యయనాలు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మీ రక్తపోటులో స్వల్ప పెరుగుదలకు దారితీస్తుందని కనుగొన్నారు. మోకాలి మీద వేరే కాలను వేసినప్పుడు రక్తపోటులో కొంచెం స్పైక్ ఉంటుంది. ఇది తాత్కాలికంగానే ఉందనే విషయం గమనించాలి.

కాళ్లపై కాళ్లు వేసుకుని అడ్డంగా కూర్చోవడం వల్ల నరాలలో వాపు, నొప్పి వస్తుందని నమ్ముతారు. అయితే అది నిజం కాదు. మీ సిరల్లోని కవాటాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎడెమా, వెరికోస్ వీన్స్ ఏర్పడతాయి. గుండె వైపు రక్తాన్ని పంప్ చేయడానికి శారీరక శ్రమ అవసరం. ఈ స్థితిలో సిరల్లో వాపు ఏర్పడుతుంది. ఎక్కువసేపు కూర్చునే లేదా నిలబడే వారికి వెరికోస్ వీన్స్ వచ్చే ప్రమాదం ఉంది. మీ కూర్చున్న భంగిమతో దీనికి సంబంధం లేదు.

కూర్చునే భంగిమ గర్భిణులపై ఎక్కువగా ప్రభావం చూపదు. శిశువుకు హాని కలిగించదు. అయితే మీరు చీలమండ నొప్పి, కండరాల ఒత్తిడి లేదా వెన్నునొప్పిని అనుభవించవచ్చు. ఎందుకంటే మీరు గర్భంలో మరొక ప్రాణాన్ని మోస్తున్నప్పుడు, మీ శరీరం అనేక అంతర్గత మార్పులను ఎదుర్కొంటుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ప్రసవంలో సమస్యలు వస్తాయని చెబుతారు.

మోకాళ్ల నొప్పులు అనేవి గాయం, కీళ్లనొప్పులు, మరేదైనా ఆరోగ్య పరిస్థితి వల్ల సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కీళ్ల లేదా మోకాలి సమస్యలకు కారణమవుతుంది. మీరు ఇప్పటికే మోకాళ్లకు సంబంధించిన ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే నిర్దిష్ట భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం మీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల మీరు అలాంటి భంగిమల్లో కూర్చోకూడదు. గంటలు గంటలు ఒకే సీటులోనూ కూర్చొవద్దు. మధ్య మధ్యలో లేచి నడవాలి.

తదుపరి వ్యాసం