తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Itel Vision 3 Turbo । అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఐటెల్ ఫోన్‌!

itel Vision 3 Turbo । అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఐటెల్ ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

22 September 2022, 20:59 IST

    • ఐటెల్ నుంచి itel Vision 3 Turbo అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. దీని బ్యాటరీ 20 నిమిషాల ఛార్జ్ తోనే 3 గంటల టాక్ టైమ్ అందించగలదు. ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువ.
itel Vision 3 Turbo
itel Vision 3 Turbo

itel Vision 3 Turbo

మొబైల్ బ్రాండ్ ఐటెల్, తాజాగా భారత మార్కెట్లో itel Vision 3 Turbo అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ బ్రాండ్ తక్కువ బడ్జెట్ గాడ్జెట్లకు ప్రసిద్ధి. కొత్తగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ కూడా సరసమైన ధరలోనే లభించనుంది. అయితే ఇందులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లను మాత్రం భారీగానే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

itel Vision 3 Turboలో 6GB RAM (వర్చువల్ ర్యామ్), HD+ రిజల్యూషన్ కలిగిన 2.5D కర్వ్డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మెరుగైన బ్యాటరీ వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. దీని బ్యాటరీ రివర్స్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీతో బ్యాటరీ బ్యాకప్‌ను 20 శాతం మేర పెంచవచ్చు. ఈ రేంజ్ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ సాధారణంగా రూ. 20-30 వేల బడ్జెట్ లో ఉంటుంది. కానీ itel Vision 3 Turbo మాత్రం మీకు రూ. 10 వేల లోపు ధరతోనే లభిస్తుంది. అదనంగా కంపెనీ వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల వరకు స్క్రీన్ పగిలిపోతే, ఉచితంగా కొత్త స్క్రీన్ అమర్చుతామని పేర్కొంది.

ఇంకా ఈ itel Vision 3 Turbo స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అసలు ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఈ కింద చూడండి.

itel Vision 3 Turbo స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
  • 3GB+3GB Turbo RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • యూనిసాక్ SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్
  • వెనకవైపు 8MP+AI డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్
  • ధర రూ. 7,699/-

ఈ ఫోన్ మల్టీ గ్రీన్, జ్యువెల్ బ్లూ, డీప్ ఓషన్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు.

తదుపరి వ్యాసం