తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koffee With Karan: కారులో సెక్స్ చేశానంటున్న విజయ్.. కరణ్ బోల్డ్ ప్రశ్నలు

Koffee With Karan: కారులో సెక్స్ చేశానంటున్న విజయ్.. కరణ్ బోల్డ్ ప్రశ్నలు

26 July 2022, 13:16 IST

    • Koffee With Karan: కాఫీ విత్ కరణ్ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే పాల్గొన్నారు. ఇందులో భాగంగా కరణ్ వారిని బోల్డ్ ప్రశ్నలు అడుగ్గా.. వారు కూడా అంతే బోల్డ్‌గా సమాధానమిచ్చారు.
కాఫీ విత్ కరణ్ షోలో విజయ్-అనన్యా పాండే
కాఫీ విత్ కరణ్ షోలో విజయ్-అనన్యా పాండే (HT)

కాఫీ విత్ కరణ్ షోలో విజయ్-అనన్యా పాండే

Vijay Devarakonada in Koffee with Karan: బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ 7వ సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇటీవలే సమంత, అక్షయ్ కుమార్ ఎపిసోడ్ అద్భుతమైన రీచ్ అందుకుంది. ముఖ్యంగా సామ్.. తన వ్యక్తిగత ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలను చెప్పింది. ఈ ఎపిసోడ్ కోసం ఆమె అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూశారు. ప్రస్తుతం అదే విధంగా విజయ్ దేవరకొండ ఎపిసోడ్ కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు. రౌడీ హీరోతో పాటు అనన్యా పాండే ఇందులో పాల్గొన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

Koffee With Karan ప్రోమోను గమనిస్తే కరణ్ జోహార్ విజయ్, అనన్యాలను బోల్డ్ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అనన్యా పాండే కొత్త బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ అని వస్తున్న వార్తలపై తొలి ప్రశ్న అడిగాడు కరణ్. ఆదిత్య రాయ్ కపూర్‌కు, నీకు మధ్య ఏం జరుగుతుందని అనన్యను అడుగుతారు. అందుకు ఆమె మౌనంగా ఉంటుంది. నా పార్టీలో నేను చూశాను అని ఆమెతో కరణ్ అంటారు. దీంతో ఆమె "అలాంటిదేమి నువ్వేమి అక్కడ చూడలేదు" అంటూ కరణ్ ప్రశ్నను తిరస్కరిస్తుంది.

ర్యాపిడ్ ఫైర్ రౌండులో విజయ్ దేవరకొండ వద్దకు వచ్చిన కరణ్.. చివరగా "నువ్వు సెక్స్ ఎప్పుడు చేశావు" అంటూ రౌడీ హీరోను అడుగుతాడు. అందుకు అతడు.. ఆపండి(Abort) అంటూ సమాధానమిస్తాడు. ఈ ప్రశ్నను అందుకున్న అనన్యా "ఈ రోజు ఉదయమే" అంటూ బదులిస్తుంది. విజయ్ మళ్లీ అందుకుని "కారులో చేశానని" బదులిస్తాడు. కారులో కంఫర్ట్‌గా ఉందా అని కరణ్ మరోసారి అడుగ్గా.. "తప్పలేదు.. ప్లాన్ లేకుండా చేశానని" రౌడీ హీరో రిప్లయి ఇచ్చాడు.

చివరగా కరణ్.. విజయ్‌ను మరోసారి బోల్డ్ ప్రశ్న అడుగుతాడు. "ముగ్గురుతో(Threesome) కలిసి శృంగారంలో పాల్గొన్నావా?" అంటూ అడుగ్గా.. 'లేదు' అని విజయ్ సమాధానమిస్తాడు. అనంతరం "ఫర్వాలేదు" అని తన సమాధానాన్ని పొడిగిస్తాడు మన రౌడీ హీరో.

ఈ ప్రోమో చూస్తే కరణ్ జోహార్.. ఈ ఎపిసోడ్ అంతా వీరిద్దరిని బోల్డ్ ప్రశ్నలే అడిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోకు మరి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగ్గా.. వాటన్నింటికీ హీరో తనదైన శైలిలో బదులిచ్చాడు విజయ్. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ప్రోమో వీడియోను చూసిన నెటిజన్లు ఫుల్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం