తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana Naidu 2 Update: రానా నాయుడు సీజన్-2కు రంగం సిద్ధం..! వెంకీ నోట మరోసారి ఆ మాటలు తప్పవు

Rana Naidu 2 Update: రానా నాయుడు సీజన్-2కు రంగం సిద్ధం..! వెంకీ నోట మరోసారి ఆ మాటలు తప్పవు

19 April 2023, 12:13 IST

    • Rana Naidu 2 Update: వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్‌ రెండో సీజన్ తెరకెక్కించనున్నారు. మొదటి సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి మరోసారి సీజన్-2కు రంగం సిద్ధం చేయనున్నారు మేకర్స్.
రానా నాయుడు సీజన్ 2కు రంగం సిద్ధం
రానా నాయుడు సీజన్ 2కు రంగం సిద్ధం (MINT_PRINT)

రానా నాయుడు సీజన్ 2కు రంగం సిద్ధం

Rana Naidu 2 Update: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా నాయుడు గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌ ఓవర్గం ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్‌లో మాట్లాడే భాష, పదాలపై మాత్రం బాగా చర్చ జరిగింది. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ నుంచి అసభ్యకరమైన మాటలు వినడం తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా రానా నాయుడు సిరీస్ మేకర్స్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారంటూ వెంకటేష్‌పై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా రానా నాయుడుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

రానా నాయుడు సీజన్ 2కు శ్రీకారం చుట్టారు మేకర్స్. రానా, నాగాల కలహాలు, మనస్పర్థలు, మూర్ఖత్వాలను మరోసారి బుల్లితెరపై చూడొచ్చని ప్రకటించారు. ఈ సారి మరిన్నీ మలుపులు, షాక్‌లతో రానా నాయుడు సిరీస్ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సిరీస్‌లోని పాత్రల సంఘర్షణలు, బలమైన వ్యక్తులు- సెలబ్రెటీలు ఒకరితో ఒకరు పోరాడినప్పుడు ఏర్పడే అల్లకల్లోలాలను, విడిపోయిన కుటుంబంలో తలెత్తే సమస్యలను చూపించి మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని, అందుకే రెండో సీజన్‌ను కూడా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు.

తెలుగు ప్రేక్షకులకు ఈ సిరీస్ పెద్దగా రుచించనప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం విపరీతంగా చూశారు. మొదటి రెండు వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్‌గా ట్రెండ్ అయింది ఎక్కువ మంది చూసిన నాన్ ఇంగ్లీష్ టీవీ సిరీస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. భారత్‌లో మాత్రం వరుసగా మూడు వారాలు అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం