తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk Episode 3: అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ గెస్టులు వీళ్లే.. చూస్తే షాకే

Unstoppable With NBK Episode 3: అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ గెస్టులు వీళ్లే.. చూస్తే షాకే

Hari Prasad S HT Telugu

14 December 2023, 10:17 IST

    • Unstoppable With NBK Episode 3: బాలక‌ృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లిమిటెడ్ ఎడిషన్ మూడో ఎపిసోడ్ గెస్టులను రివీల్ చేసింది ఆహా ఓటీటీ. నలుగురు గెస్టులతో ఈ ఎపిసోడ్ సాగనుంది.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో బాలకృష్ణ
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో బాలకృష్ణ (Image Credit : Aha Twitter)

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో బాలకృష్ణ

Unstoppable With NBK Episode 3: బాలయ్య బాబు ఓటీటీ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే తాజాగా లిమిటెడ్ ఎడిషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలుసు కదా. ఈ ఎడిషన్ తొలి రెండు ఎపిసోడ్లలో ఓసారి భగవంత్ కేసరి టీమ్, మరోసారి యానిమల్ టీమ్ గెస్టులగా వచ్చారు. తాజాగా మూడో ఎపిసోడ్ గెస్టులను ఆహా ఓటీటీ రివీల్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే మూడో ఎపిసోడ్ లో శ్రియ శరణ్, సుహాసిని మణిరత్నం, జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ రానుండటం విశేషం. ఈ ఎపిసోడ్ గెస్టుల లిస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పటి టాప్ హీరోయిన్లు, కనుమరుగైపోయిన ఓ డైరెక్టర్, మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్న మరో డైరెక్టర్.. ఇలా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే మూడో ఎపిసోడ్ లో గెస్టులు అయోమయానికి గురి చేస్తున్నారు.

ఈ గెస్టులను బుధవారం (డిసెంబర్ 13) తమ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా ఆహా రివీల్ చేసింది. మొదట ఆ గెస్టులెవరో చెప్పుకోండి చూద్దాం అని సవాలు విసిరిన షో మేకర్స్.. తర్వాత ఆ నలుగురిని రివీల్ చేశారు. "మిస్టరీ రివీల్ అయిపోయింది. ఇప్పుడీ స్టార్స్ తో అన్‌స్టాపబుల్ సరదాకి మీరు రెడీనా? అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే త్వరలోనే ఆహాలో రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ ఎపిసోడ్ ప్రోమోను పోస్ట్ చేసింది.

ఇందులో బాలయ్య కేవలం గెస్టులకు వెల్‌కమ్ చెబుతున్న వీడియో మాత్రమే ఉంది. వాళ్లతో ఎలాంటి టాక్స్ జరిగాయి? ఈ ఎపిసోడ్ ఎలా సాగిందన్నది ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఎవరూ ఊహించని గెస్టులతోనే ఆశ్చర్యపరిచిన షో ఆర్గనైజర్లు.. ఆ ఎపిసోడ్ ను కూడా ఆసక్తికంగా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తారేమో చూడాలి.

అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ తొలి రెండు ఎపిసోడ్లు బాగా ఆకట్టుకున్నాయి. తొలి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీమ్ నుంచి అనిల్ రావిపూడి, కాజల్, శ్రీలీల వచ్చారు. వాళ్లతో ఈ మూవీ హీరో బాలకృష్ణ ఓ ఆటాడుకున్నాడు. ఇక ఈ మధ్యే యానిమల్ టీమ్ తమ మూవీని ఈ షో ద్వారా ప్రమోట్ చేసింది. దీనికి రణ్‌బీర్ కపూర్, రష్మికతోపాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా వచ్చాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం