తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Top Gun Maverick Ott Release Date: టామ్ క్రూజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది

Top Gun Maverick OTT Release Date: టామ్ క్రూజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది

17 December 2022, 14:07 IST

  • Top Gun Maverick OTTRelease Date: టామ్ క్రూజ్ హీరోగా న‌టించిన టాప్ గ‌న్ మావెరిక్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

టామ్ క్రూజ్
టామ్ క్రూజ్

టామ్ క్రూజ్

Top Gun Maverick OTTRelease Date: టామ్ క్రూజ్ హీరోగా న‌టించిన టాప్ గ‌న్ మావెరిక్ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. డిసెంబర్ 26 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది . ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వదులుకున్న నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవే

1986లో రూపొందిన టాప్‌గ‌న్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో మావెరిక్ మిచెల్‌గా త‌న న‌ట‌న‌తో టామ్ క్రూజ్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను సినీ అభిమానుల్ని అల‌రించాయి. శ‌త్రు దేశంలోని యురేనియం ప్లాంట్‌ను ధ్వంసం చేసే బాధ్య‌త‌ను చేప‌ట్టిన మావెరిక్ ఆ ప‌నిని ఎలా పూర్తిచేశాడ‌నే పాయింట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు జోస‌ఫ్ కొసిన్స్కీ టాప్ గ‌న్ మావెరిక్ సినిమాను తెర‌కెక్కించారు.

మే నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన టాప్ గ‌న్ మావెరిక్‌ 2022లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా టామ్ క్రూజ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది వ‌చ్చిన టాప్ టెన్ బెస్ట్ సినిమాల్లో ఒక‌టిగా టాప్ గ‌న్ మావెరిక్‌ను అమెరిక‌న్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్ర‌క‌టించింది.

నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ కూడా టామ్ క్రూజ్ సినిమాను బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక‌చేసింది. టాప్ గ‌న్ రూస్ట‌ర్ పేరుతో ఈ ఫ్రాంచైజ్‌లో మూడో భాగం రాబోతున్న‌ది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం