తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Taraka Ratna Final Rituals:: నేడు తారకరత్న అంత్యక్రియలు.. చిత్రసీమలో విషాద ఛాయలు

Taraka Ratna Final Rituals:: నేడు తారకరత్న అంత్యక్రియలు.. చిత్రసీమలో విషాద ఛాయలు

20 February 2023, 7:56 IST

    • Taraka Ratna Final Rituals: సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత తారకరత్న అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
తారక రత్న
తారక రత్న

తారక రత్న

Taraka Ratna Final Rituals: ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు తారకరత్న భౌతిక కాయాన్ని మోకిలా నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. పది గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్‍ను మిస్ అవ్వొద్దు!

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

NNS Serial May 16th Episode: మిస్స‌మ్మ‌ను అవ‌మానించిన మ‌నోహ‌రి - త‌ల్లికి ఎదురుతిరిగిన అమ‌ర్ - నిజ‌మైన అరుంధ‌తి మాట‌

నందమూరి తారకరత్న అకాల మృతి చిత్రసీమలో విషాద చాయలు అలముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తారకరత్న పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి, ఎన్‌టీఆర్, కళ్యాణ్ రామ్, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

భర్త మరణంతో తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆమెను ఓదార్చడం కుటుంబ సభ్యుల వల్ల కూడా కావట్లేదు. శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించి ఆదివారం నాడు అస్వస్థతకు గురయ్యారు.

ఇటీవల తెదేపా నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్నను ఆసుపత్రికి తరలించారు. గత 23 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం